ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jeff Bezos: అమెజాన్ వ్యవస్థాపకుడికి షాక్.. కుబేరుల్లో రెండో స్థానం కోల్పోయిన జెఫ్ బెజోస్

ABN, Publish Date - Jun 14 , 2025 | 05:21 PM

అమెజాన్ (Amazon) వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు (Jeff Bezos) షాకింగ్ న్యూస్ వచ్చింది. 2017 నుంచి ప్రపంచంలో రెండో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న ఆయన తాజాగా ఆ స్థానాన్ని కోల్పోయారు. ఇప్పుడు బెజోస్‌ ఏ స్థానానికి చేరుకున్నారు, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Jeff Bezos

ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్ (Amazon) వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కి (Jeff Bezos) షాక్ తగిలింది. ఫోర్బ్స్ తాజా ర్యాంకింగ్స్ (Forbes rankings 2025) ప్రకారం, ఒరాకిల్ వ్యవస్థాపకుడు ల్యారీ ఎలిసన్, ఒక్కరోజులో $26 బిలియన్లు లాభపడి, తన మొత్తం సంపదను $258 బిలియన్లకు పెంచుకున్నారు. ఈ భారీ వృద్ధి ద్వారా ఒరాకిల్ స్టాక్ ధర 13% పెరిగి, ఒక్కరోజులో అతిపెద్ద లాభం నమోదు కావడంతో ఈ సంస్థ ఆదాయం పెరిగింది. ఈ మార్పు ద్వారా జెఫ్ బెజోస్ $227.8 బిలియన్లతో నాలుగో స్థానానికి చేరుకున్నారు.

కొత్త జాబితాలో అగ్రస్థానం..

2017 నుంచి రెండో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతూ వచ్చిన జెఫ్ బెజోస్ స్థానాన్ని తాజాగా ల్యారీ ఎలిసన్ దక్కించుకున్నారు. మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ $239.3 బిలియన్లతో మూడో స్థానానికి చేరారు. మరోవైపు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా టెస్లా CEO ఎలాన్ మస్క్ $408.2 బిలియన్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈ పరిణామం టెక్ దిగ్గజాల మధ్య పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. ప్రతి ఒక్కరూ తమ సంస్థల వృద్ధి, స్టాక్ మార్కెట్ ప్రదర్శనలపై దృష్టి పెట్టి, తమ స్థాయిని మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తున్నారు.

ప్రపంచ కుబేరుల టాప్ 5 తాజా ర్యాంకులు

  • ఎలాన్ మస్క్ – $408.2 బిలియన్లు

  • ల్యారీ ఎలిసన్ – $258 బిలియన్లు

  • మార్క్ జుకర్‌బర్గ్ – $239.3 బిలియన్లు

  • జెఫ్ బెజోస్ – $227.8 బిలియన్లు

  • బెర్నార్డ్ ఆర్నాల్ట్ - దాదాపు $200 బిలియన్లు

సంపద మాత్రమే కాదు..

ఈ మార్పులు టెక్నాలజీ రంగంలో జరుగుతున్న పరిణామాలను, మార్కెట్ డైనమిక్స్‌, వ్యాపారవేత్తల వ్యూహాలను ప్రతిబింబిస్తున్నాయి. ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సంపాదించాలంటే, కేవలం సంపద మాత్రమే కాదు. వ్యూహాత్మక దృష్టి, మార్కెట్ అవగాహన, సమర్థత కూడా అవసరం. ల్యారీ ఎలిసన్, ఒరాకిల్ సంస్థను 1977లో స్థాపించారు. ప్రస్తుతం ఆయన సంస్థలో సీఈవోగా కొనసాగుతున్నారు. తనకు ఒరాకిల్‌లో సుమారు 40% వాటా ఉంది. తాజాగా, ఒరాకిల్ క్లౌడ్ సేవల ఆదాయం 21% పెరిగి $6.7 బిలియన్లకు చేరుకుంది. క్లౌడ్ మౌలిక సదుపాయాల అమ్మకాలు 53% పెరిగాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..


టెలికాం యూజర్లకు గుడ్ న్యూస్.. పోస్ట్‌పెయిడ్ టూ ప్రీపెయిడ్‌ మరింత ఈజీ


For National News And Telugu News

Updated Date - Jun 14 , 2025 | 05:59 PM