ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ABSLI : పూర్తిగా మహిళా సిబ్బందితో తొలి ఇన్సూరెన్స్ శాఖ ప్రారంభం.. అదీ మన హైదరాబాద్‌లో

ABN, Publish Date - Jul 07 , 2025 | 10:46 PM

ఆదిత్య బిర్లా క్యాపిటల్‌కు చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ABSLI), హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో పూర్తిగా మహిళలతో నడిచే తమ తొలి బ్రాంచ్‌ను ప్రారంభించింది.

హైదరాబాద్: ఆదిత్య బిర్లా క్యాపిటల్‌కు చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ABSLI), హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో పూర్తిగా మహిళలతో నడిచే తమ తొలి బ్రాంచ్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌‌లో కార్యకలాపాలు విస్తరించే క్రమంలో భాగంగా మహిళలకు సాధికారత, సమానావకాశాలు కల్పించే దిశగా ఈ శాఖను ప్రారంభించామని సంస్థ తెలిపింది. కంపెనీ ఈ ఏడాది తొలినాళ్లలో ముంబైలోని ములుండ్‌లో పూర్తిగా మహిళా సిబ్బందితో ఒక శాఖను ప్రారంభించగా హైదరాబాద్ శాఖ రెండోది. హిమాయత్‌నగర్ శాఖను పూర్తిగా మహిళలు నిర్వహిస్తారు. మహిళా సలహాదారులు శిక్షణ కార్యక్రమాలు, క్లయింట్ సమావేశాలపై దృష్టి సారించడంలో ఇది సహాయపడుతుంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఎండీ & సీఈవో కమ్లేశ్ రావు మాట్లాడుతూ... “మహిళల సాధికారత ఒక బాధ్యత మాత్రమే కాదు, మా వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన అంశం కూడా. సమతౌల్యతను సాధించేందుకు తోడ్పడుతూ, ఆకాంక్షలను గౌరవించే విధంగా వర్క్‌ప్లేస్‌లను తీర్చిదిద్దడం ద్వారా సమ్మిళిత వృద్ధికి దోహదపడటంలో ఈ ఆల్-ఉమెన్ శాఖ ఒక నిదర్శనం. నాయకత్వం వహించేందుకు, వృద్ధి చెందడానికి, స్ఫూర్తిగా నిలవడానికి మహిళలకు దీర్ఘకాలిక అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం” అని అన్నారు.

ABSLAMC స్ట్రక్చర్డ్ ఆపర్చునిటీస్ ఫండ్ సిరీస్ II...

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ (ABSLAMC) తమ స్ట్రక్చర్డ్ ఆపర్చునిటీస్ ఫండ్ - సిరీస్ II మొదటి ముగింపును ప్రకటించింది. ఈ AIF కో-ఇన్వెస్ట్‌మెంట్లతో సహా రూ.700 కోట్లను సమీకరించింది. మొత్తం రూ.2,500 కోట్లు (రూ.1,250 కోట్ల గ్రీన్ షూ ఎంపికతో) సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ABSLAMC ఎండీ & సీఈఓ ఎ.బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ, ఈ ఫండ్ విజయం ప్రైవేట్ క్రెడిట్ విభాగంలో మదుపరులకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని, కార్పొరేట్ వృద్ధికి మద్దతునిస్తూ విలువను సృష్టించగల తమ సామర్థ్యంపై నమ్మకం ఉందని పేర్కొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 10:46 PM