ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Accenture Acquires TalentSprint: యాక్సెంచర్‌ గూటికి టాలెంట్‌స్ర్పింట్‌

ABN, Publish Date - Apr 24 , 2025 | 03:35 AM

హైదరాబాద్‌కు చెందిన డీప్‌టెక్‌ ఎడ్యుకేషన్‌ కంపెనీ టాలెంట్‌స్ర్పింట్‌ను యాక్సెంచర్‌ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంతో 210 మంది ఉద్యోగులు యాక్సెంచర్‌ లర్న్‌వాంటేజ్‌ భాగంగా మారనున్నారు

బెంగళూరు: హైదరాబాద్‌కు చెందిన డీప్‌టెక్‌ ఎడ్యుకేషన్‌ కంపెనీ టాలెంట్‌స్ర్పింట్‌ను అంతర్జాతీయ ఐటీ దిగ్గజం యాక్సెంచర్‌ కొనుగోలు చేసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) పూర్తి అనుబంధ విభాగమైన ఎన్‌ఎ్‌సఈ అకాడమీ లిమిటెడ్‌ నుంచి ఈ సంస్థను టేకోవర్‌ చేసింది. ఈ డీల్‌ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. 2009లో ప్రారంభమైన టాలెంట్‌స్ర్పింట్‌.. హైదరాబాద్‌తో పాటు సన్నీవేల్‌, కాలిఫోర్నియాలోనూ కార్యాలయాలను కలిగిఉంది. ప్రస్తుతం టాలెంట్‌స్ర్పింట్‌ ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐఎం వంటి ప్రముఖ విద్యాసంస్థలు, టెక్నాలజీ ప్రొవైడర్ల భాగస్వామ్యంలో వర్థమాన, అనుభవజ్ఞులైన వృత్తినిపుణులకు కృత్రిమ మేధ (ఏఐ), డేటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, చిప్‌ డిజైన్‌, సెమీ కండక్టర్‌ టెక్నాలజీస్‌, డిజిటల్‌ పరివర్తనం వంటి ఆధునిక టెక్నాలజీ కోర్సులతో పాటు మేనేజ్‌మెంట్‌ విభాగంలో లీడర్‌షిప్‌ అండ్‌ సస్టెయినబిలిటీ ప్రోగ్రామ్స్‌ను కూడా ఆఫర్‌ చేస్తోంది. కాగా, ఈ కొనుగోలు ఒప్పందంలో భాగంగా టాలెంట్‌స్ర్పింట్‌కు చెందిన 210 మంది ఉద్యోగులు యాక్సెంచర్‌కు చెందిన లర్న్‌వాంటేజ్‌లో చేరనున్నారు. తమ క్లయింట్ల సిబ్బంది నైపుణ్యాలను పెంచేందుకు తోడ్పడే లర్న్‌వాంటేజ్‌ సామర్థ్యాన్ని ఈ డీల్‌ మరింత బలోపేతం చేయనుందని యాక్సెంచర్‌ పేర్కొంది.

Updated Date - Apr 24 , 2025 | 03:36 AM