ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Numerology: ఫోన్ నంబర్ లక్కీనో, కాదో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి.!

ABN, Publish Date - Sep 05 , 2025 | 11:41 AM

న్యూమరాలజీ ప్రకారం మీ ఫోన్ నంబర్ లక్కీనా కాదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ సింపుల్ టిప్ మీ కోసమే..

Lucky Phone Number

ఇంటర్నెట్ డెస్క్: న్యూమరాలజీ ప్రకారం వ్యక్తిగత సంఖ్యలు మన జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతాయి. ఈ సంఖ్యలు పుట్టినతేది, పేరు, వాహన నంబర్, ఫోన్ నంబర్ వంటి అంశాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఫోన్ నంబర్ కూడా వ్యక్తి జీవితం, పనితీరు, ఆర్థిక పరిస్థితి, సానుకూల శక్తులపై ప్రభావం చూపవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఫోన్ నంబర్ లక్కీనా కాదో ఎలా తెలుసుకోవాలి..

ఫోన్ నంబర్‌లోని అన్ని అంకెలను కలపడం ద్వారా ఆ సంఖ్య లక్కీనా కాదో తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియలో చివరికి సింగిల్ డిజిట్ మిగిలేలా చేయాలి.

ఉదాహరణ:

  • మొబైల్ నంబర్: 78526194181

  • అన్ని అంకెలను కలపాలి: 7+8+5+2+6+1+9+4+1+8+1 = 52

  • సింగిల్ డిజిట్ కోసం మరోసారి కలపాలి: 5+2 = 7

  • ఫైనల్ డిజిట్ 7. ఈ డిజిట్ ఆధారంగా ఫోన్ నంబర్ వ్యక్తిగత లక్షణాలను సూచిస్తుంది.

సింగిల్ డిజిట్ అర్థాలు

  • 1 - నాయకత్వ లక్షణాలు, స్వతంత్ర ఆలోచన

  • 2 - సహకారం, సంబంధాలపై దృష్టి

  • 3 - సృజనాత్మకత, కళలు, వ్యక్తిత్వ వికాసం

  • 4 - క్రమబద్ధత

  • 5 - మార్పులు, స్వేచ్ఛ

  • 6 - కుటుంబ ప్రాధాన్యం, హార్మనీ, కళలు

  • 7 - జ్ఞానం, ఆధ్యాత్మికత

  • 8 - ఆర్థిక లాభాలు, విజయాలు, వ్యాపారం

  • 9 - దాతృత్వం, సామాజిక సేవ, సానుకూల ప్రభావం

ముఖ్య సూచనలు

ఫోన్ నంబర్ లెక్కించేటప్పుడు ఈ సింగిల్ డిజిట్ అర్థాలను పరిగణలోకి తీసుకుంటే వ్యక్తిగత, వృత్తి, కుటుంబ జీవితంలో సానుకూల ప్రభావం పొందవచ్చు. లక్కీ ఫోన్ నంబర్ ఉన్నప్పటికీ, జీవితంలో శ్రమ, సమయపాలన, సమర్ధత అనేవి కూడా చాలా ముఖ్యం. నిబద్ధతతో నిర్ణయాలు తీసుకోవాలి. మీ ఫోన్ నెంబర్ లక్కీనో కాదో కేవలం ఫన్ కోసం మాత్రమే చెక్ చేసుకుంటే సరిపోతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

Also Read:

ఉపాధ్యాయ దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటామో తెలుసా?

ఓనం పండుగ.. 10 రోజులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

For More Latest News

Updated Date - Sep 05 , 2025 | 01:56 PM