ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Numerology: ఈ సంఖ్య ఉన్నవాళ్లు చిన్ని విషయానికే కోపం పడతారు..

ABN, Publish Date - Jun 10 , 2025 | 01:07 PM

సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఈ సంఖ్య ఉన్నవాళ్లు చిన్ని విషయానికే కోపం పడతారని నిపుణులు చెబుతున్నారు. ఇతరుల కింద పని చేయడం వీరికి ఇష్టం ఉండదని, వీరికి స్వతంత్రంగా పనిచేయాలనిపిస్తుందని అంటున్నారు.

Numerology

సంఖ్యాశాస్త్రం ప్రకారం మన పుట్టిన తేదీలోని అంకెలను కలిపి తీసే సంఖ్యను రాడిక్స్ లేక మూల సంఖ్య అంటారు. పుట్టిన తేదీ ఆధారంగా వచ్చే మూల సంఖ్య మన స్వభావాన్ని, ఆలోచనల తీరును, ఎలా నిర్ణయాలు తీసుకుంటామో అన్నింటినీ ప్రభావితం చేస్తుంది. ఇందులో కొన్ని సంఖ్యల వాళ్లు చాలా శాంతంగా ఉంటే, మరికొన్ని సంఖ్యల వాళ్లు చిన్న విషయానికే త్వరగా రెచ్చిపోతారు. ఈ రోజు మనం సంఖ్యాశాస్త్రం ఆధారంగా కోపానికి బాగా గురయ్యే వ్యక్తుల గురించి తెలుసుకుందాం..

మూల సంఖ్య 1 ఉన్నవాళ్ల స్వభావం ఎలా ఉంటుంది?

  • రాడిక్స్ 1 పాలక గ్రహం సూర్యుడు. సూర్యుడు శక్తి, అహం, నాయకత్వానికి ప్రతీక.

  • ఈ సంఖ్య ఉన్నవాళ్లు ఎంతో ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు.

  • ఇతరుల కింద పని చేయడం వీరికి ఇష్టం ఉండదు, వీరికి స్వతంత్రంగా పనిచేయాలనిపిస్తుంది.

  • ఏ పని అయినా కష్టపడి, పూర్తి నిబద్ధతతో చేస్తారు.

  • కుటుంబాన్ని, భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు.

  • కోపం వీరి ప్రధానమైన లక్షణం

  • నెంబర్ 1 ఉన్నవాళ్లు చిన్న విషయానికే త్వరగా కోపం తెచ్చుకుంటారు. వాళ్ల కోపాన్ని ఆపడం చాలా కష్టం. కానీ బయటకు కోపంగా కనిపించినా, వీరు లోపల మాత్రం చాలా మృదువైన మనసు కలవాళ్లు.

  • కొంతమంది వీరిని కోపంగా భావించి దూరంగా ఉండొచ్చు, కానీ వాస్తవానికి వీరికి మంచి మనస్సు ఉంటుంది.

మూల సంఖ్య 1 ఉన్నవాళ్లు సహజంగా నాయకత్వ లక్షణాలతో ఉంటారు. కానీ వాళ్ల కోపాన్ని నియంత్రించగలిగితే వారు వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తి జీవితంలోనూ గొప్ప స్థాయికి చేరగలుగుతారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

పాలను ఇలా మరిగిస్తే.. ఆరోగ్యానికి ముప్పు తప్పదు..

11, 12 తేదీల్లో డ్రోన్లపై నిషేధం..

For More Lifestyle News

Updated Date - Jun 10 , 2025 | 01:07 PM