ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

10 తులాల బంగారం రికవరీ

ABN, Publish Date - Nov 12 , 2025 | 12:06 AM

కాశీబుగ్గ సబ్‌ డివి జన్‌ పరిధిలో ఐదు బంగారం గొ లుసులు చోరీకి పాల్పడిన వ్యక్తిని కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేసి ఆ వ్యక్తి నుంచి 10 తులాల బంగా రాన్ని రికవరీ చేశారు.

వివిరాలు వెల్లడిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

  • గొలుసుల దొంగ అరెస్ట్‌

  • ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ సబ్‌ డివి జన్‌ పరిధిలో ఐదు బంగారం గొ లుసులు చోరీకి పాల్పడిన వ్యక్తిని కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేసి ఆ వ్యక్తి నుంచి 10 తులాల బంగా రాన్ని రికవరీ చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాల యంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మంగళ వారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్ల డించారు. ఒడిశా రాష్ట్రం కేంద్రపర జిల్లాకు చెంది న మహేశ్వర్‌ దలై ఈ ఏడాది జనవరి, అక్టోబరు, నవంబరు నెలల్లో జిల్లాలో కాశీబుగ్గ సబ్‌ డివిజన్‌ పరిధిలో ఒంటరి మహిళలను టార్గెట్‌ చేస్తూ దోపి డీలకు పా ల్పడుతుండేవాడు. అతడిని కోసంగిపు రం వద్ద అ నుమానాస్పదంగా తిరుగుతుండగా కాశీబుగ్గ పోలీ సులు అదుపులోకి తీసుకొని విచా రించారు. కాశీబు గ్గ, కవిటి, మందస తదితర ప్రాంతాల్లో ఐదుగురు మహిళల నుంచి బంగారు గొలుసులు చోరీకి పాల్పడినట్టు నేరం అంగీకరిం చాడు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఆలయాల వద్ద పటిష్ఠ భద్రత

ఇటీవల కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయం లో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తు లు మృతి చెందిన నేపథ్యంలో ఇటువంటి ఘట నలు పునరావృతం కాకుండా ఆలయాల్లో గట్టి భద్ర తా చర్యలు ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. జిల్లాలో సుమారు 11 వేల దేవాలయా లను గుర్తించామని, వాటిని ఏ, బీ, సీ, డీ కేటగి రులుగా విభజించి భద్రతా చర్యలు తీసు కున్నామ న్నారు. ప్రభుత్వ ఆఽధీనంలో లేని ప్రైవేట్‌ దేవాల యాల్లో కమిటీ సభ్యులే బాధ్యత వహించాలన్నారు. కార్తీకమాసం పురస్కరించుకొని మరీ రద్దీ ఎక్కువు న్న దేవాలయాల్లో ముందస్తుగా పోలీసు శాఖకు సమాచారం అందించాలన్నారు. నాగావళి నదిలో ఇటీవల స్నానానికి దిగిన వారు ప్రమాదా నికి గురవుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని, త్వరలో హెచ్చరిక బోర్డులను నదీతీర ప్రాం తంలో ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలో ఉన్న డేఅండ్‌నైట్‌ కూడలి, ఏడు రోడ్ల జంక్షన్‌ వద్ద ఉన్న వంతెనలపై సీసీ కెమెరాలను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

జిల్లాలో ప్రత్యేక నిఘా

ఢిల్లీలో పేలుడి ఘటన నేపథ్యంలో జిల్లాలో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామని ఎప్పీ పేర్కొ న్నారు. ఒడిశాను ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశామని, నాకాబందీ ము మ్మరం చేశామన్నారు. లాడ్జీలు, హోటళ్లను తమ సిబ్బంది తనిఖీలు చేస్తూ అనుమానితులు తార సపడితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారన్నా రు. నిరంతరం వాహనతనిఖీలు చేస్తున్నామన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 12:06 AM