ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: సార్‌ @ బెంగళూర్‌

ABN, Publish Date - Jun 05 , 2025 | 02:50 AM

ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని క్యాడర్‌కు వైసీపీ అధినేత జగన్‌ పిలుపునిచ్చారు. తీరా అసలు సమయానికి రాష్ట్రంలో కనబడకుండా ఆయన బెంగళూరు ప్యాలె్‌సకు వెళ్లిపోయారు.

వెన్నుపోటు దినం నిరసనలకు

పిలుపిచ్చి జగన్‌ డుమ్మా

అధ్యక్షుడి తీరుపై పార్టీ నేతల్లో అసహనం

వైసీపీకే జగన్‌ వెన్నుపోటు అంటూ ఆగ్రహం

జిల్లాల్లో నిరసన ప్రభావం అంతంతే

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వెన్నుపోటు దినం పేరిట రాష్ట్రమంతా బుధవారం నిరసనలు చేపట్టాలని.. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని క్యాడర్‌కు వైసీపీ అధినేత జగన్‌ పిలుపునిచ్చారు. తీరా అసలు సమయానికి రాష్ట్రంలో కనబడకుండా ఆయన బెంగళూరు ప్యాలె్‌సకు వెళ్లిపోయారు. వెన్నుపోటు దినంలో పాల్గొనేందుకు పార్టీ అధ్యక్షుడిగా రాజధానిలో తాడేపల్లి నివాసం నుంచి బయటకు వస్తారేమోనని ఆశించిన పార్టీ క్యాడర్‌ నిరాశకు గురైంది. బెంగళూరుకు పారిపోయి వైసీపీకే జగన్‌ వెన్నుపోటు పొడిచారంటూ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది అయిన సందర్భంగా బుధవారం రోజును జగన్‌ వెన్నుపోటు దినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తర్వాత దశాదిశా లేకుండా నిరసన కార్యక్రమాన్ని చేపట్టే బాధ్యతను క్యాడర్‌పై వదిలేశారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీ పిలుపునిస్తే.. ఆ పార్టీ అధ్యక్షుడు ముందుండి నిరసనలో పాల్గొంటారు. పార్టీ క్యాడర్‌ను సన్నద్ధం చేసి, ప్రజలు భాగస్వాములయ్యేలా కార్యాచరణ రూపొందిస్తారు. నిరసనలో పాల్గొన్న నేతలను పోలీసులు సమీప పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి వదిలేస్తారు. ఇది సాధారణంగా జరిగే తతంగం. పోలీసు స్టేషన్‌ దాకా వెళ్లేందుకు జగన్‌ భయపడ్డారో ఏమో కానీ తాడేపల్లిలో కనిపించకుండా ఉడాయించేశారు. ఇతర పార్టీల అధ్యక్షుల మాదిరి కాదని, తన తీరు విరుద్ధమని జగన్‌ మరోసారి నిరూపించారు. సహజంగా వారాంతాల్లో జగన్‌ దంపతులు బెంగళూరు ప్యాలె్‌సకు వెళతారు. రౌడీషీటర్లుగా పేరున్న యువకులపై పోలీసులు దాడి చేశారంటూ మంగళవారం తెనాలికి వెళ్లి పరామర్శించిన జగన్‌.. బుధవారం వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని ఎగ్గొట్టి బెంగళూరుకు వెళ్లిపోయారు. ఇలా అకస్మాత్తుగా జగన్‌ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్లిపోవడం వైసీపీకే వెన్నుపోటు దినంగా పార్టీ క్యాడర్‌ వాపోతోంది. నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు నాయకత్వం కొరవడటంతో.. చాలా వరకు నిరసన ప్రభావం కనిపించలేదు.


నిర్బంధం లేకపోయినా..

వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సం ఘాలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పక్షాలు నిరసనలకు పిలుపునిస్తే నిర్బంధంగా అణచివేసేవారు. నేతల ఇంటి వద్ద ముందురోజు రాత్రి నుంచే పోలీసులు పహారా కాసేవారు. ఎవరినీ బయటకు రానివ్వకుండా కట్టడి చేసేవారు. ఎవరైనా తప్పించుకుని రైలులోనో, బస్సులోనో, ఇతర వాహనాల్లోనో నిరసనలో పాల్గొనేందుకు వెళ్తే పోలీసులు వేటాడి అరెస్టులు చేసేవారు. కానీ బుధవారం నాడు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులేవీ కనిపించలేదు. రాజకీయ పార్టీగా వైసీపీ ఆందోళన కార్యక్రమాలను చేసుకునేందుకు ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది. కానీ వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం ప్రభావం అంతగా కనిపించలేదు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 07:00 AM