Veeranki Gurumurthi : గీత కార్మికుల పొట్టకొడతారా!
ABN, Publish Date - Feb 05 , 2025 | 03:20 AM
కల్లుగీత కార్మికులకు కేటాయించిన 340 మద్యం షాపులపై వైసీపీ వారు హైకోర్టులో 35 రిట్‌పిటిషన్లు వేసి అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.
మద్యం దుకాణాల్ని వైసీపీ అడ్డుకోవడం దుర్మార్గం
గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి
అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం కల్లుగీత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేస్తుంటే వారి పొట్టకొట్టేందుకు వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నారని గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి విమర్శించారు. కల్లుగీత కార్మికులకు కేటాయించిన 340 మద్యం షాపులపై వైసీపీ వారు హైకోర్టులో 35 రిట్‌పిటిషన్లు వేసి అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం గురుమూర్తి విలేకరులతో మాట్లాడారు. గీత కార్మికులకు ఆర్థిక చేయూత అందించేందుకు కూటమి ప్రభుత్వం జీవో 13 ద్వారా రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాల్లో 10 శాతం గీత కార్మికులకు ఇవ్వాలని నిర్ణయించిందని, దీనివల్ల గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, యాత వంటి ఉపకులాలకు ఎంతో ఉపయోగం అన్నారు. మద్యం షాపుల ఫీజుల్లోనూ 50 శాతం రాయితీ ఇచ్చారని.. వాటిని అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమన్నారు. వైఎస్ హయాం నుంచి కూడా బీసీలంటే అంటరానివారిగా చూసేవారని, జగన్ సైతం అదే బాటలో పయనిస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. చంద్రబాబు దాన్ని 34 శాతానికి పెంచారని, కానీ జగన్ హయాంలో బీసీల రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించారని దుయ్యబట్టారు. వైసీపీ తీరు మారకుంటే 11 సీట్లు కూడా లేకుండా చేసే సత్తా బీసీలకు ఉందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం
శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Feb 05 , 2025 | 03:20 AM