ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Satyakumar: యోగాంధ్రకు 2.04 కోట్ల మంది పేర్లు నమోదు

ABN, Publish Date - Jun 12 , 2025 | 05:41 AM

ప్రజల్లో యోగాభ్యాసం పట్ల అవగాహనను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నెల రోజుల యోగాంధ్ర కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను పది రోజులు ముందుగానే దాటేశామని ఆరోగ్యశాఖ...

  • లక్ష్యాలను పది రోజులు ముందుగానే దాటేశాం

  • నేడు రాష్ట్ర పునర్నిర్మాణ సంకల్ప దినం: మంత్రి సత్యకుమార్‌

అమరావతి, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): ప్రజల్లో యోగాభ్యాసం పట్ల అవగాహనను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నెల రోజుల యోగాంధ్ర కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను పది రోజులు ముందుగానే దాటేశామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి వరకూ 2,04,64, 831 మంది యోగాభిమానులు పేర్లు నమోదు చేసుకున్నారని, యోగా శిక్షకుల నమోదు, వారి శిక్షణ, యోగా పోటీల నిర్వహణ, స్థలాల ఎంపిక కూడా పూర్తయిందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న విశాఖలో జరిగే ప్రధాన కార్యక్రమంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా ఎంపిక చేసిన కేంద్రాల్లో రెండు కోట్ల మంది యోగాభిలాషులు పాల్గొనే దిశగా లక్ష్యాన్ని నిర్దేశించామని తెలిపారు. కాగా, జూన్‌ 12ను రాష్ట్ర పునర్నిర్మాణ సంకల్ప దినంగా మంత్రి సత్యకుమార్‌ మరో ప్రకటనలో అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఈ ప్రకటన విడుదల చేశారు.

Updated Date - Jun 12 , 2025 | 05:43 AM