ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అభివృద్ధిని ఓర్వలేకే వైసీపీ విమర్శలు: అచ్చెన్న

ABN, Publish Date - Jun 16 , 2025 | 04:47 AM

కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

టెక్కలి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆ విమర్శలను తిప్పికొట్టేలా మరింత అభివృద్ధి దిశగా అడుగులేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ మే 22న మన ఊరు.. మాటామంతీ కార్యక్రమంలో భాగంగా రావివలస గ్రామాభివృద్ధికి రూ.15కోట్లతో పనులు చేపట్టనున్నట్టు ఇచ్చిన హామీ మేరకు ఆదివారం రావివలసలో రూ.12కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.13కోట్లతో టెక్కలిలో పట్టుమహాదేవి కోనేరు గట్టు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లెల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. ‘కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తున్నాం. రాష్ట్రంలో 67లక్షల మంది మహిళలకు తల్లికి వందనం పథకం నిధులు ఖాతాల్లో జమ చేశాం’ అని తెలిపారు.

Updated Date - Jun 16 , 2025 | 04:49 AM