ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sailaja Rayapati: మచిలీపట్నం ఘటన.. బాధితురాలికి రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ పరామర్శ

ABN, Publish Date - May 31 , 2025 | 06:33 PM

Machilipatnam Incident: ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితులు ఎంతటి వారైనా సరే తప్పని సరిగా శిక్షపడేలా చేస్తానని శైలజ రాయపాటి బాలిక కుటుంబానికి హామీ ఇచ్చారు.

Machilipatnam Incident

మచిలీపట్నం: 70 ఏళ్ల వృద్ధ ఉపాధ్యాయుడు ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. శారీరకంగా తనకు సహకరించాలంటూ ఆ ఉపాధ్యాయుడు బాలిపై ఒత్తిడి తెచ్చాడు. ఆయన వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రులు సరైన సమయంలో గుర్తించటంతో..ప్రాణాలతో బయటపడింది. ఇక, ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ శైలజ రాయపాటి స్పందించారు. లైంగిక వేధింపులకు గురైన బాలిక కుటుంబానికి ఫోన్ చేసి పరామర్శించారు.


బాధిత బాలికతో వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం నింపారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితులు ఎంతటి వారైనా సరే తప్పని సరిగా శిక్షపడేలా చేస్తానని శైలజ రాయపాటి బాలిక కుటుంబానికి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. ఇటువంటి దురాగతాలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి

ఇకపై కొత్త కార్యాలయం నుంచే జాగృతి కార్యకలాపాలు.. కవిత

ఆపరేషన్ సిందూర్‌పై కామెంట్లు.. లా స్టూడెంట్ అరెస్ట్..

Updated Date - May 31 , 2025 | 06:39 PM