ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt: వాట్సప్‌లోనే బర్త్, డెత్ సర్టిఫికేట్లు

ABN, Publish Date - Jan 20 , 2025 | 07:03 PM

AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే పలు సేవలను మరింత సులభతరం చేస్తోంది. అందులోభాగంగా ఇప్పటికే రైతులు ధాన్యం విక్రయించేందుకు వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తీసుకు వచ్చింది.

అమరావతి, జనవరి 20: ఆంధ్రప్రదేశ్ వాసులకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వాట్సాప్ ద్వారా జనన, మరణ ధృవీకరణ పత్రాలు అందించేందుకు సన్నాహాకాలు చేస్తోంది. తొలుత తెనాలిలో దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టి.. పరిశీలించాలని నిర్ణయించింది. త్వరలో దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు.

సోమవారం అమరావతిలో ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధ్యక్షతన.. వాట్సాప్ గవర్నెన్స్, ఏపీ సీఆర్ఎస్ అమలుపై ఆర్టీజీఎస్‌ వేదికగా ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ క్రమంలో డేటా ఇంటిగ్రేషన్ సహా సాంకేతిక సవాళ్లను సైతం పరిశీలించనున్నామని ఆయన వివరించారు.

ప్రభుత్వ సేవలు మరింత సరళతరం చేసి ప్రజల ముంగిట ఉంచాలని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. అందులోభాగంగా ఇప్పటికే ధాన్యం పండించిన రైతులు.. వాటిని సులువుగా విక్రయించేందుకు వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం విధితమే.


అదే సమయంలో జనన మరణ ధృవీకరణ పత్రాలను వాట్సాప్ ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. ఇలా ప్రజలకు అవసరమైన ప్రతి అంశాన్ని సులువుగా వారికి అందించేందుకు ఈ ప్రభుత్వం పలు సన్నాహకాలు చేస్తోంది.

Also Read: మౌని అమావాస్య రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదంటే..?


మరోవైపు గతేడాది డిసెంబర్‌ రెండో వారంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సహా వివిధ ధృవీకరణ పత్రాలను పొందడానికి వాట్సాప్‌ను ఉపయోగించే కొత్త వ్యవస్థను తీసుకు రానున్నట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

Also Read: నాగ సాధువులు.. రహస్యాలు

Also Read: ట్రంప్ ప్రమాణ స్వీకారం.. ఈ పుస్తకమే కీలకం


పౌరుల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడంతోపాటు ఆర్టీజీఎస్ ద్వారా ప్రజల సంతృప్తి స్థాయిని పర్యవేక్షించడానికి ఏఐతోపాటు డీప్ టెక్ వంటి సాంకేతిక పరిజ్ఞానను వినియోగించాలని సూచించారు. అలాగే రియల్ టైమ్ సమాచారాన్ని సేకరించిన తర్వాత ఇతర విభాగాలతో పరస్పరం అనుసంధానించడంతో పాటు సమర్థవంతమైన పరిపాలనను అందించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవాలని అన్ని శాఖ అధిపతులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

Also Read: కోల్‌కతా వైద్య విద్యార్థిపై హత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు

Also Read: ట్రంప్ డిన్నర్‌లో నీతా అంబానీ కట్టిన చీర ప్రత్యేకతలు ఇవే..


ఆ క్రమంలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను పొందడానికి వాట్సాప్‌ను ఒక వేదికగా మార్చే విధంగా వ్యవస్థను రూపొందించాలని ఆధికారులకు ఆయన సూచించారు. ఇక ఆధార్ సేవలను ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లాలన్నారు. అవసరమైన కిట్ల కొనుగోలు కోసం రూ.20 కోట్లు నిధులను సీఎం చంద్రబాబు మంజూరు చేసిన విషయం విధితమే.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 20 , 2025 | 07:40 PM