ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Visakha Mayor Post: విశాఖ మేయర్ పీఠం దక్కడంలో గేమ్‌ఛేంజర్ ఆ ఎమ్మెల్యేనే

ABN, Publish Date - Apr 22 , 2025 | 12:13 PM

Visakha Mayor Post: వైసీపీని ఒక్కొక్కరిగా వీడుతున్నారని.. బొత్స వంటి లీడర్లు ఉండబట్టే ఇంకా పార్టీ ఉందని ఎమ్మెల్యే వంశీ కృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.

Visakha Mayor Post

విశాఖపట్నం, ఏప్రిల్ 22: విశాఖ మేయర్ పీఠం కూటమికి దక్కడానికి ఎమ్మెల్యే వంశీ కృష్ణ (MLA Vamshi Krishna) గేమ్ చేంజర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో (ABN-Andhrajyothy) ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విశాఖ మేయర్ పీఠాన్ని కూటమికి ఇవ్వడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) బర్డ్‌డే గిఫ్ట్‌గా భావించామన్నారు. మేయర్ పీఠం దక్కడం వెనక తన ఒక్కడి పాత్ర మాత్రమే కాదని.. చాలా మంది గేమ్ చేంజెర్లు ఉన్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి (YSRCP Jagan Mohan Reddy) వ్యవహార శైలి నచ్చకపోవడమే కూటమికి మేయర్ పీఠం దక్కడానికి ప్రధాన కారణమన్నారు.


రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి 15 కార్పొరేటర్ సీట్లు గెలవమనండి చూద్దామంటూ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. వైసీపీని ఒక్కొక్కరిగా వీడుతున్నారని.. బొత్స వంటి లీడర్లు ఉండబట్టే ఇంకా పార్టీ ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. అభివృద్ధి - సంక్షేమం పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. లేదంటే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ఎమ్మెల్యే వంశీ హెచ్చరించారు.

Vijayasai Reddy Tweet: మద్యం కుంభకోణంపై సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు


కాగా.. ఇటీవల విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకున్న విషయం తెలిసిందే. వైసీపీ మేయర్ హరి వెంకట కుమారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూటమి కార్పొరేటర్లు నెగ్గారు. అవిశ్వాస తీర్మానం కోసం జీవీఎంసీ ప్రత్యేకంగా సమావేశం అవగా.. 74 మంది సభ్యుల బలంతో కూటమి విజయం సాధించింది. ఈనెల 19న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించగా.. హెడ్‌ కౌంట్ అనంతరం అందరి వద్ద సంతకాలు తీసుకుని ఓటింగ్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఓటింగ్‌లో 74 మంది సభ్యులు హాజరుకావడంతో కూటమి అవిశ్వాసం నెగ్గింది. అయితే ఆఖరి నిమిషంలో కాస్త కూటమి నేతల్లో ఆందోళన చోటు చేసుకుంది. ముందున్న 74 మెజార్టీలో ఒకరు జారుకోవడంతో చివరి నిమిషంలో మాజీ మంత్రి కూతురు ప్రియాంక చేరికతో విశాఖ మేయర్‌ పీఠం కూటమి సొంతమైంది. మొత్తం 63 మంది కార్పొరేటర్లు, 11 మందిఎక్స్ అఫీషియల్ సభ్యులు ఓటింగ్‌లో కూటమి అవిశ్వాసం నెగ్గింది. విశాఖ మేయర్ పీఠం దక్కడంతో కూటమి నేతుల సంబరాలు చేసుకున్నారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడారని, న్యాయం, ధర్మం నెగ్గిందని కూటమి నేతలు చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి

Zeeshan Siddique: బాబా సిద్ధిఖీ తర్వాత జీషన్‌ టార్గెట్..నీ తండ్రిలాగే నిన్ను చంపేస్తామని బెదిరింపు

JD Vance Jaipur Tour: అంబర్‌ కోటను సందర్శించిన జేడీ వాన్స్ కుటుంబం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 22 , 2025 | 12:13 PM