ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

New Flight Routes: జూన్‌ 13 నుంచి విశాఖ-అబుధాబీ విమాన సర్వీస్‌

ABN, Publish Date - May 10 , 2025 | 05:23 AM

విశాఖ-అబుధాబీ అంతర్జాతీయ విమాన సర్వీస్‌ జూన్‌ 13 నుంచి ప్రారంభం కానుంది. భువనేశ్వర్‌, బెంగళూరుకు దేశీయ విమాన సర్వీసులు కూడా జూన్‌లోనే ప్రారంభం కానున్నాయని ఏపీ ఎయిర్‌ ట్రావెలర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది

  • దేశీయంగా మరో రెండు సర్వీసులు కూడా జూన్‌లోనే..

  • కేంద్ర మంత్రి రామ్మోహన్‌కు ట్రావెలర్స్‌ అసోసియేషన్‌ కృతజ్ఞతలు

విశాఖపట్నం, మే 9 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 13వ తేదీ నుంచి విశాఖపట్నం-అబుధాబీ మధ్య అంతర్జాతీయ విమాన సర్వీస్‌ మొదలు కానుందని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం శుక్రవారం తెలిపింది. ఇది వారానికి నాలుగు రోజులు ఉంటుంది. అదేవిధంగా విశాఖపట్నం-భువనేశ్వర్‌ సర్వీస్‌ జూన్‌ 12 నుంచి ప్రారంభం కానుంది. విజయవాడ నుంచి బెంగళూరు సర్వీస్‌ జూన్‌ 2వ తేదీ నుంచే అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. కొత్త విమాన సర్వీసులు వేసినందుకు మంత్రి కె.రామ్మోహన్‌నాయుడుకు ఏపీ ఎయిర్‌ ట్రావెలర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కుమార్‌ రాజా, నరేశ్‌కుమార్‌, డీఎస్‌ వర్మ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - May 10 , 2025 | 05:23 AM