JEE Success: విజ్ఞాన్ విజయపరంపర
ABN, Publish Date - Apr 20 , 2025 | 06:54 AM
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విజ్ఞాన్ విద్యార్థులు అఖిల భారతస్థాయిలో అద్భుత విజయాలు సాధించారు. విజ్ఞాన్ కళాశాలలో 50% మందికి పైగా విద్యార్థులు 90 పర్సంటైల్‌కు పైగా స్కోర్ చేశారు
గుంటూరు(విద్య), ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో అఖిల భారతస్థాయిలో విజ్ఞాన్ విద్యార్థులు విజయపరంపర మోగించారని విజ్ఞాన్ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్ తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ కోచింగ్ తీసుకున్న విద్యార్థులలో 50 శాతం మంది విద్యార్థులు 90 శాతం పర్సంటైల్ సాధించారని తెలిపారు. వై.విష్ణుకార్తీక్(99.45), ఆర్.శ్రీకాంత్(98.38), కె.విష్ణు వర్థన్(98.05) తదితరులు ఉత్తమ పర్సంటైల్‌తో రాణించారని వెల్లడించారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను విజ్ఞాన్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య, వడ్లమూడి, గుంటూరు మహిళా జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ జె.మోహన్ రావు, వై.వెంకటేశ్వరరావు, అధ్యాపకులు అభినందించారు.
Updated Date - Apr 20 , 2025 | 06:54 AM