Venkaiah Naidu speech: మాతృభాష కంటి చూపు.. ఆంగ్లభాష కళ్లజోడు
ABN, Publish Date - Apr 08 , 2025 | 04:48 AM
మాతృభాష కంటి చూపులా ఉంటే, ఆంగ్లభాష కళ్లజోడులాంటిదని వెంకయ్య నాయుడు అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, ఆరోగ్య習ాలు పాటిస్తూ మాతృభాషకు గౌరవం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరవకూడదు
విద్యార్థులతో ముఖాముఖిలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
వెంకటాచలం, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): మన మాతృభాష కంటి చూపైతే.. ఆంగ్లభాష కళ్లజోడు లాంటిదని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మాత్రం ఏ ఒక్కరూ మారవకూడదని చెప్పారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో సోమవారం ఆయన విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. జీవితంలో పాటించాల్సిన పలు అంశాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. పిజ్జాలు, బర్గర్ల జోలికి వెళ్లవద్దన్నారు. ఇంటి భోజనం తింటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. సెల్‌ఫోన్లు ఎక్కువగా వాడితే సొంతంగా ఆలోచించడం మానేస్తారని, నేటి యువతరం రాత్రుళ్లు నిద్రపోకుండా సెల్‌ఫోన్లు వాడుతున్నారని, ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. గూగుల్ ఏ గురువునూ మించింది కాదన్నారు. తల్లిదండ్రులు, గురువులను విద్యార్థులు గౌరవించాలని హితబోధ చేశారు. ఆరోగ్యంగా ఉండటానికి విద్యార్థులు యోగా, వ్యాయామం కచ్చితంగా చేయాలన్నారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన పాటించినప్పుడే ఉన్నతస్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయన్నారు. చదువు పట్ల అశ్రద్ధ చూపకుండా ఇష్టపడి చదవాలన్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, భారతదేశంలోనే అత్యున్నమైన యూనివర్సిటీలు, విద్యాసంస్థలు ఉన్నాయన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని విద్యాసంస్థలు అనుసరించాలని సూచించారు. అనంతరం పాటలు, పద్యాలతో అలరించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందించి అభినందించారు.
ఇవి కూడా చదవండి..
TGSRTC: ఎండీకి నోటీసులు.. మోగనున్న సమ్మె సైరన్
Vaniya Agarwal: మైక్రోసాఫ్ట్‌ను అల్లాడించిన వానియా అగర్వాల్ ఎవరు
Rains: ఓరి నాయనా.. ఎండలు మండుతుంటే.. ఈ వర్షాలు ఏందిరా
Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..
Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..
Nara Lokesh: ‘సారీ గయ్స్..హెల్ప్ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్
LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..
Updated Date - Apr 08 , 2025 | 04:48 AM