Nara Lokesh: ‘సారీ గయ్స్..హెల్ప్ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:27 PM
Nara Lokesh: నేరాల నియంత్రణకు ఏపీ పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. అందులోభాగంగా పోలీసులు ఎక్కడికక్కడ డ్రోన్ల ద్వారా నేరాలను పసిగడుతోన్నారు. ఆ క్రమంలో ఓ వీడియోను పోలీసులు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీనిని ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రీ పోస్ట్ చేశారు. అంతేకాదు ఆయన కీలక కామెంట్ సైతం చేశారు.

అమరావతి, ఏప్రిల్ 07: రాష్ట్రంలో మద్యం, డ్రగ్స్ నియంత్రణకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో నేరాల నియంత్రణపై సైతం దృష్టి సారించింది. అందులోభాగంగా డ్రోన్ కెమెరాలతో నేరాల నియంత్రణకు పోలీసులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలతో నేరాల నియంత్రణకు తగు చర్యలు తీసుకొంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోను జిల్లా పోలీస్ అధికారులు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌ను ఐటీ, పరిశ్రమలు, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ రీ పోస్ట్ చేస్తూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఇటీవల గుడివాడ పరిధిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల వెనుక మద్యం సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు డ్రోన్ ద్వారా గుర్తించారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నారంటూ వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు. యువకులు మద్యం తాగుతోన్న డ్రోన్ దృశ్యాలకు సంబంధించిన వీడియోకి ఓ టాలీవుడ్ చిత్రంలోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ జోడించి ఎక్స్ ఖాతాలో పోలీసులు పోస్ట్ చేశారు.
దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. రీ పోస్ట్ చేశారు. సారీ గయ్స్.. నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నా. ఎందుకంటే ఏపీ పోలీసులు వారి విధులు నిర్వర్తిస్తున్నారంటూ మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా వేదికగా రీ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మద్యం తాగుతోన్న యువకుల వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందింస్తున్నారు. అలాగే నేరాల నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలపై సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జే బ్రాండ్ మద్యం విక్రయాలు, డ్రగ్స్ అడ్డు ఆపు లేకుండా విచ్చలవిడిగా విక్రయించేవారు. ఈ కారణంగా నాటి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు సైతం వెల్లువెత్తాయి. అయితే 2024 మే, జూన్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలోని పార్టీలకు ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం గత ప్రభుత్వ హయాంలోని మద్యం బ్రాండ్లను నిలిపివేశారు. అలాగే డ్రగ్స్ సరఫరా, గంజాయి సాగుపై ఉక్క పాదం మోపారు. అవి ఎక్కడైనా సరఫరా అవుతూ.. పట్టుబడితే మాత్రం వారిపై ప్రభుత్వం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్న విషయం విధితమే.
ఇవి కూడా చదవండి..
Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..