AP Govt: ఐఎస్‌డబ్ల్యూ సిబ్బందికి యూనిఫామ్ అలవెన్స్ పెంపు
ABN, Publish Date - Jun 12 , 2025 | 05:11 AM
ఏపీ నిఘా విభాగంలో అంతర్భాగమైన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ)సిబ్బందికి యూనిఫామ్ అలవెన్స్ రూ.11వేలకు పెంచుతూ ప్రభుత్వం...
అమరావతి, జూన్ 11(ఆంధ్రజ్యోతి): ఏపీ నిఘా విభాగంలో అంతర్భాగమైన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ)సిబ్బందికి యూనిఫామ్ అలవెన్స్ రూ.11వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పోలీసుశాఖలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు ఇప్పటికే రూ.11 వేలు అందుతుండగా ఐఎస్‌డబ్ల్యూ(వీఐపీల రక్షణ) సిబ్బందికి ప్రభుత్వం 8,750 మాత్రమే చెల్లిస్తోంది. నిఘా విభాగాధిపతి ప్రతిపాదనతో అలవెన్సు పెంచుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ ఉత్తర్వులిచ్చారు.
Updated Date - Jun 12 , 2025 | 05:18 AM