AP Crime News: పాడె కట్టిన వ్యక్తికి లక్షల్లో నగదు
ABN, Publish Date - May 31 , 2025 | 05:04 AM
పల్నాడు జిల్లాలో జరిగిన జంట హత్యల కేసులో రాజకీయ కుట్ర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ నేతలతో అనుబంధం, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా మరికొంతమంది పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
పల్నాడు జంట హత్యల కేసులో విస్తుపోయే నిజాలు
పోలీసుల అదుపులో ముగ్గురు వైసీపీ నేతలు?
మాచర్లటౌన్, మే 30(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లాలో సంచలనం రేపిన జంట హత్యల కేసుల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నా యి!. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీకి చెందిన జెవిశెట్టి వెంకటేశ్వర్లు, అతడి సోదరుడు కోటేశ్వరరావు హత్య జరిగిన తీరుపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయిన తీరును పరిశీలిస్తే ఈ హత్యలో అనేకమంది ఇందులో ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది. నిందితుల్లో ఏ2గా ఉన్న వ్యక్తి.. జంట హత్యలకు నెల రోజుల ముందే జెవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులతో విభేదించి టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉన్నట్లు గుర్తించా రు. సమీప గ్రామమైన కండ్లకుంట గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన ముగ్గురు కీలక నేతలతో సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తోంది. ఒక నాయకుడి ఇంట్లో పార్టీ కూడా చేసుకున్నట్లు గుర్తించారు. మరో ఇద్దరు నేతలతో ఫోన్‌లో నిరంతరం చాటింగ్ జరిపినట్లు తెలుస్తోంది. ఆ నేతలే ఈ హత్యలో పాల్గొన్న వ్యక్తులకు నగదును సమకూర్చి వేర్వేరు మార్గాల్లో లక్షలాది రూపాయలను అకౌంట్లలో జమ చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. హతుల అంతిమయాత్ర సమయంలో పాడె కట్టిన ఓ వ్యక్తి అకౌంట్‌లో కూడా లక్షల కొద్దీ నగదు జమ అయినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దీని వెనుక అసలు సూత్రధారులను గుర్తించేందుకు మరింత లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ‘మాకిది చేసి పెట్టండి.. మీకు మేము రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఉపయోగపడతాం’ అని నమ్మించి కొంత మందిని ఈ ఉచ్చులోకి దించి వారి అకౌంట్లలోకి నగదును జమ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కండ్లకుంట గ్రామానికి చెందిన ముగ్గురు వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News
Updated Date - May 31 , 2025 | 05:05 AM