ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tuition Teacher: హోంవర్క్‌ చేయలేదని వాతలు

ABN, Publish Date - Feb 27 , 2025 | 03:41 AM

హోం వర్క్‌ చేయడం లేదన్న కారణంతో ఓ విద్యార్థికి ట్యూషన్‌ టీచర్‌ అట్లకాడ కాల్చి వాతలు పెట్టింది.

  • ఒంగోలులో ట్యూషన్‌ టీచర్‌ దారుణం.. కేసు నమోదు

ఒంగోలు క్రైం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): హోం వర్క్‌ చేయడం లేదన్న కారణంతో ఓ విద్యార్థికి ట్యూషన్‌ టీచర్‌ అట్లకాడ కాల్చి వాతలు పెట్టింది. ఇదేమిటని ప్రశ్నించిన తల్లిదండ్రులను ఆమె భర్త చంపుతానని బెదిరించాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. ఒంగోలులోని గంటాపాలెంలో నివాసం ఉండే మూడో తరగతి విద్యార్థి.. ఇంటి ఎదురు ఉండే సాబీరా వద్దకు ట్యూషన్‌కు వెళ్తుంటాడు. ఈ నెల 20న ఆ విద్యార్థి హోం వర్క్‌ చేయలేదన్న కోపంతో ట్యూషన్‌ టీచర్‌ సాబీరా అట్లకాడ కాల్చి పిరుదులపై వాతలు పెట్టింది. తీవ్రమైన గాయాలవ్వడంతో రోదిస్తూ ఇంటికి వెళ్లిన విద్యార్థి.. ట్యూషన్‌ టీచర్‌ నిర్వాకాన్ని తల్లికి చెప్పాడు. తల్లిదండ్రులు సాబీరాకు ఫోన్‌ చేసి ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకపోగా సాబీరా భర్త తమను చంపుతామని బెదిరించాడని విద్యార్థి తల్లి ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Feb 27 , 2025 | 03:44 AM