TTD kiosk services: కియోస్క్‌తో టీటీడీ సేవలు సులువు..
ABN, Publish Date - Jun 05 , 2025 | 06:11 AM
కియోస్క్‌ల సాయంతో భక్తులకు టీటీడీ సేవలు సులభంగా అందుతున్నాయి. పైగా బోలెడంత సమయం ఆదా అవుతోంది. దీంతో ఈ కియోస్క్‌లను విరివిగా వినియోగించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది.
ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో 20 కియోస్క్‌ల ఏర్పాటు
త్వరలోనే లడ్డూ సేవలు, టికెట్ల ప్రింట్‌కూ వినియోగం
టీటీడీ సేవల్లో కీలకం కానున్న ‘కియోస్క్’ యంత్రాలు
తిరుమల, జూన్4(ఆంధ్రజ్యోతి): రానున్న రోజుల్లో టీటీడీలో కియోస్క్ (సెల్ఫ్ ఆపరేటెడ్ మిషన్) యంత్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి. కియోస్క్‌ల సాయంతో భక్తులకు టీటీడీ సేవలు సులభంగా అందుతున్నాయి. పైగా బోలెడంత సమయం ఆదా అవుతోంది. దీంతో ఈ కియోస్క్‌లను విరివిగా వినియోగించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు హుండీ ద్వారా కాకుండా విరాళాలు ఇవ్వాలంటే పెద్ద తతంగమే ఉండేది. రూ.లక్షకుపైగా విరాళాలు ఇవ్వాలంటే దాతల విభాగానికి చేరుకుని, అక్కడ అన్ని వివరాలూ తెలియజేసిన తర్వాతే విరాళాలు తీసుకునేవారు. రూ.లక్షలోపు విరాళాలకు వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఓ కౌంటర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ వివరాలు నమోదు చేయడం, కార్డు లేదా నగదుతో విరాళాలు చెల్లించడం వంటి ప్రక్రియతో భక్తులు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో రూ.లక్షలోపు విరాళాలిచ్చే భక్తులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో తొలిసారిగా వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఈ కియోస్క్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. భక్తులు దీనిలోని క్యూఆర్ కోడ్‌ను తమ సెల్‌ఫోన్‌తో స్కాన్ చేసి యూపీఐ ద్వారా రూ.లక్షలోపు ఎంతైనా విరాళంగా అందించవచ్చు. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో టీటీడీ ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో 20 కియో్‌స్కలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఇప్పటివరకు రూ.4 కోట్ల విరాళాలు రావడం గమనార్హం. ఇక టీటీడీ అందిస్తున్న మరికొన్ని సేవల్లోకి కియో్‌స్కలను ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే లడ్డూలు పొందే భక్తులకూ కియో్‌స్కలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. లడ్డూ ఆప్షన్‌లోకి వెళ్లి కావాల్సిన లడ్డూ సంఖ్యను టైప్ చేసి యూపీఐ ద్వారా నగదు చెల్లిస్తే ఓ రసీదు వస్తుంది. ఆ రసీదును లడ్డూ కౌంటర్‌లో చూపించి లడ్డూలు పొందవచ్చు. తద్వారా భక్తుల నిరీక్షణ సమయం తగ్గుతుందని టీటీడీ భావిస్తోంది.
బ్రేక్ టికెట్ల ప్రింట్ కూడా తీసుకోవచ్చు
ఈ కియో్‌స్కలో వీఐపీ బ్రేక్ టికెట్లను కూడా సులభతరంగా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఉండే ఈ కియోస్క్ మిషన్‌లో బ్రేక్ దర్శన టికెట్ ఆప్షన్‌లోకి వెళ్లి ఎన్‌రోల్‌మెంట్ నంబరును ఎంటర్ చేసి పేమెంట్ చేస్తే టికెట్ ప్రింట్ ఇస్తుంది. దీంతో భక్తులు వారు బస చేసే అతిథిగృహాలు, కాటేజీల్లోనే సులభంగా టికెట్లు పొందవచ్చు. ఇలా పలు విభాగాల్లోకి కియో్‌స్కలను ప్రవేశపెట్టి భక్తులకు సులభతరంగా సేవలు అందించాలని టీటీడీ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇది భక్తులకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jun 05 , 2025 | 06:11 AM