ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tribal Woman: డోలీలో గర్భిణి.. అడవిదారిలో ప్రసవం

ABN, Publish Date - May 02 , 2025 | 05:43 AM

విజయనగరం జిల్లా శృంగవరపుకోట పంచాయతీ రేగపుణ్యగిరి నుండి ఆస్పత్రికి వెళ్ళే మార్గంలో గిరిజన మహిళ ప్రసవించింది. గ్రామానికి రోడ్డు నిర్మాణం జరగకపోవడం వల్ల గిరిజనులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.

నిధులు మంజూరైనా రోడ్డు పూర్తికాక గిరిజనుల అవస్థలు

శృంగవరపుకోట, మే 1(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా శృంగవరపుకోట పంచాయతీ కొండశిఖర గ్రామం రేగపుణ్యగిరి నుంచి ఆస్పత్రిలో ప్రసవం కోసం డోలీలో ఓ గిరిజన మహిళను తరలిస్తుండగా, మార్గమధ్యంలో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గర్భిణి పంగి సీతమ్మకు నెలలు నిండడంతో గురువారం ఉదయం 10గంటల సమయంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. భర్త నర్సింగరావు స్థానిక గిరిజనులతో కలసి గ్రామం నుంచి కొండ దిగేందుకు డోలీ కట్టాడు. ఎస్‌.కోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్లాలనుకున్నారు. ఇంతలో నొప్పులు అధికమై మార్గమధ్యలో ఆమె ప్రసవించింది. పండంటి ఆడబిడ్డ జన్మించింది. రేగ గ్రామానికి రోడ్డు వేసేందుకు కలెక్టర్‌ నిధులు మంజూరు చేసినప్పటికీ నిర్మాణం జరగలేదని, దీంతో గిరిజనులకు అవస్థలు తప్పడం లేదని గ్రామస్థులు వాపోయారు.


ఇవి కూడా చదవండి

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 05:43 AM