ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala: ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు

ABN, Publish Date - Mar 14 , 2025 | 04:46 AM

తిరుమలలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు గురువారం ముగిశాయి. చివరిరోజు మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహరించారు.

తిరుమల, మార్చి 13(ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు గురువారం ముగిశాయి. చివరిరోజు మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహరించారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను నాలుగు మాడవీధుల్లో ఊరేగించి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ విద్యుత్‌, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీదేవి భూదేవి సమేతంగా ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు. కాగా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టి తెప్పోత్సవాల్లో పాల్గొన్నారు. ఆయన శుక్రవారం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Updated Date - Mar 14 , 2025 | 04:46 AM