Tirumala: సర్వదర్శనానికి 18 గంటలు.. రెండు కిలోమీటర్ల మేర క్యూ
ABN, Publish Date - Jun 15 , 2025 | 05:18 AM
స్కూళ్లు ప్రారంభమైనా తిరుమలలో రద్దీ తగ్గలేదు. వైకుంఠం క్యూకాంప్లెక్స్2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన శనివారం భక్తులతో నిండిపోయాయి.
తిరుమల కిటకిట
తిరుమల, జూన్ 14(ఆంధ్రజ్యోతి): స్కూళ్లు ప్రారంభమైనా తిరుమలలో రద్దీ తగ్గలేదు. వైకుంఠం క్యూకాంప్లెక్స్2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన శనివారం భక్తులతో నిండిపోయాయి. కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగురోడ్డులో శ్రీవారిసేవా సదన్ వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూలైన్ ఉంది. దీంతో దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కల్యాణకట్టలు, లడ్డూ కేంద్రం, అఖిలాండం, అన్నప్రసాద భవనాలూ రద్దీగా మారాయి. నడకమార్గాలు కూడా కిటకిటలాడుతున్నాయి. అలిపిరి పాదాల మండపం కూడా భక్తులతో రద్దీగా కనిపించింది. ఆదివారానికి సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు శనివారం సాయంత్రం 5 గంటల తర్వాత జారీ చేస్తారని తెలిసినా.. ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లకు చేరుకున్నారు.
Updated Date - Jun 15 , 2025 | 05:20 AM