ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NEET 2025 Toppers: తిరుమలకు స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌

ABN, Publish Date - Jun 15 , 2025 | 05:49 AM

నీట్‌-2025 ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తిరుమల విద్యాసంస్థల తిరుమల ఐఐటీ అండ్‌ మెడికల్‌ విద్యార్థులు ఆలిండియా స్థాయిలో అత్యుత్తమ ర్యాంక్‌లు సాధించారని...

రాజమహేంద్రవరం రూరల్‌, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): నీట్‌-2025 ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తిరుమల విద్యాసంస్థల తిరుమల ఐఐటీ అండ్‌ మెడికల్‌ విద్యార్థులు ఆలిండియా స్థాయిలో అత్యుత్తమ ర్యాంక్‌లు సాధించారని ఆ సంస్థ చైర్మన్‌ నున్న తిరుమలరావు చెప్పారు. తిరుమల విద్యాసంస్థలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దర్బా కార్తీక్‌ రామ్‌ కిరీటి ఆలిండియా స్థాయిలో ఓపెన్‌ కేటగిరిలో 19వ ర్యాంక్‌, ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించినట్టు తెలిపారు. అలాగే కె.ఈప్సిత్‌ కశ్యప్‌ 12వ ర్యాంక్‌, టి.సాహితి 32, కేవీవీ నాగసాయి పవన్‌ 154, ఎం.సూర్య సంతోష్‌రెడ్డి 880, ఎల్‌.అభిషేక్‌ 888వ ర్యాంక్‌లు కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది తమ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని, 310 మందికిపైగా ఎంబీబీఎస్‌ సీట్లు సాధిస్తారని వివరించారు. కాగా, ఢిల్లీ ఎయిమ్స్‌లో స్కల్‌ లేదా కార్డియోలజీ చేస్తానని. సూపర్‌ స్పెషాలిటీ వైద్యుడిగా సేవలందిస్తానని దర్బా కార్తీక్‌ రామ్‌ కిరీటి తెలిపారు. 8వ తరగతి నుంచి తిరుమలలోనే చదువుతున్నానని, చాలా హార్డ్‌వర్క్‌ చేశానని, ఉత్తమ బోధన వల్లే ఈ ర్యాంక్‌ సాధ్యమైందని చెప్పారు. తన తండ్రి అంజనా వైద్యాలయం డాక్టర్‌ డీఎస్‌ అరుణ్‌కుమార్‌, తల్లి శ్రీలత ప్రోత్సాహం మరువలేనిదన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 05:51 AM