ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati: నగల కోసం ఘోరం

ABN, Publish Date - Jun 20 , 2025 | 06:04 AM

గుంటూరు జిల్లా తెనాలిలో ఇద్దరు వియ్యపురాళ్లు దుండగుల ఘోరానికి బలికాగా, తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం అడవికొడియంబేడులో ఒంటరి మహిళ హత్యకు గురైంది.

  • తెనాలిలో దుండగుల చేతిలో బలైన వియ్యపురాళ్లు

  • ముగ్గురు మహిళల దారుణ హత

తెనాలి/పిచ్చాటూరు, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ముగ్గురు మహిళలను దారుణంగా హతమార్చి, వారి ఒంటిపై ఉన్న బంగారు నగలు దోచుకుపోయారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఇద్దరు వియ్యపురాళ్లు దుండగుల ఘోరానికి బలికాగా, తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం అడవికొడియంబేడులో ఒంటరి మహిళ హత్యకు గురైంది. వివరాలు... తెనాలి చినపరిమి డొంకరోడ్డులోని రావిరవీంద్రనాథ్‌కాలనీలో వియ్యపు రాళ్లు దాసరి రాజేశ్వరి(65), పెట్ట అంజమ్మ (70) కలిసి ఉంటున్నారు. గురువారం ఓ ఆటోలో మహిళ, ఇద్ద రు యువకులు వారింటికి వచ్చా రు. వియ్యపురాళ్లను హతమార్చి వారి ఒంటిపై ఉన్న బంగారం దోచుకువెళ్లారు. వృద్ధులైన తమవారి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు రాజేశ్వరి కుమార్తె, అల్లుడు ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం వీడియోలు రికార్డు కాకపోవడంతో బంధువులకు ఫోన్‌ చేసి చెప్పారు. వారు వచ్చి పరిశీలించగా వియ్యపురాళ్లు దారుణహత్యకు గురై రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఐదు కిలోల తూకం రాయితో ఒకరి తలపైన, కర్రతో మరొకరిపై దాడి చేసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ల ఆధారం గా నిందితుల్లో ఒకరు ప్రైవేట్‌ జీవిత బీమా కంపెనీలో పని చేసే మహిళగా గుర్తించారు.

గొంతు, చెవులు కోసి....

తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం అడవికొడియంబేడు అరుంధతివాడకు చెందిన కల్పన(40) అనే మహిళ భర్త చనిపోవడంతో కొడుకుతో కలిసి చెన్నైలో క్యాటరింగ్‌ పనులు చేస్తున్నారు. వారం క్రితమే గ్రామానికి వచ్చారు. బుధవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రపోయిన కల్పన తెల్లవారేసరికి రక్తమడుగులో పడి ఉన్నారు. ఆమె గొంతు కోసిన దుండగులు చెవులు కూడా కోసివేశారు. తల్లిని చంపడంతోపాటు నగలు, నగదు కూడా తీసుకుపోయారని మృతురాలి కుమారుడు శివకుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - Jun 20 , 2025 | 06:04 AM