Uday from West Godavari: లండన్ ఎన్నికల్లో ఉదయించిన తెలుగుతేజం
ABN, Publish Date - May 23 , 2025 | 07:00 AM
లండన్‌లో డిప్యూటీ మేయర్‌గా భీమవరం తుందుర్రుకు చెందిన ఉదయ్ ఎన్నికయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారంతో స్వగ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
డిప్యూటీ మేయర్‌గా పశ్చిమగోదావరి వాసి
భీమవరంరూరల్, మే 22(ఆంధ్రజ్యోతి): సెంట్రల్ లండన్‌లోని రాయల్‌బరో ఆఫ్ కెన్సింగ్టన్, చెల్సియా డిప్యూటీ మేయర్‌గా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రుకు చెందిన ఉదయ్ ఎన్నికయ్యారు. 2018లో ఆర్బీకేసీ కౌన్సిలర్‌గా ఎన్నికైన ఉదయ్... ఇప్పుడు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. గురువారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా స్వగ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. భీమవరం కేజీఆర్‌ఎల్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆరేటి వీరవెంకటసత్యనారాయణ కుమారుడే ఉదయ్.
Updated Date - May 23 , 2025 | 07:00 AM