ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Ready: జల వివాదాలపై బాబుతో మాట్లాడతా

ABN, Publish Date - Jun 21 , 2025 | 06:06 AM

పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా జల వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కలిసి కూర్చుని మాట్లాడుకుందామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు..

  • క్యాబినెట్‌ భేటీ తర్వాత ఆయన్ను ఆహ్వానిస్తా: రేవంత్‌

  • సీఎంల స్థాయిలోనే చర్చించుకోవాలి

  • మా వాటికి అనుమతిస్తే ఏపీ ప్రాజెక్టులపై అభ్యంతరం లేదు

బనకచర్లపై వాళ్లు నేరుగా కేంద్రానికి పీఎ్‌ఫఆర్‌

ఇవ్వడంతోనే వివాదం.. తెలంగాణ సీఎం వెల్లడి

న్యూఢిల్లీ, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా జల వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కలిసి కూర్చుని మాట్లాడుకుందామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. ఈ నెల 23న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి.. ఆ తర్వాత తానే ఒకడుగు ముందుకేసి చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తానని వెల్లడించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ప్రీ-ఫీజిబులిటి రిపోర్ట్‌ (పీఎ్‌ఫఆర్‌)ను నేరుగా ఇవ్వడం వల్లే వివాదం మొదలైందన్నారు. అది ఇచ్చే ముందే తెలంగాణతో చర్చించి ఉంటే వివాదం ఉండేది కాదని చెప్పారు. ఏపీతో విభేదాలు కోరుకోవడం లేదని, అలాగని రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. మోదీ ప్రధాని సీట్లో కూర్చోవాలంటే చంద్రబాబు మద్దతు కావాలని, అందుకే, ఏపీ సర్కారు పీఎ్‌ఫఆర్‌ ఇచ్చిన వెంటనే కేంద్రం స్పందిస్తోందని, 18 నెలలుగా తాము ఎన్నిసార్లు కలిసినా స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇద్దరు సీఎంలు కూర్చుని ప్రాజెక్టుల వారీగా సమస్యలపై చర్చిద్దాం. ఒకరోజు కాకపోతే నాలుగు రోజులైనా చర్చలకు సిద్ధమే. న్యాయ, సాంకేతిక అంశాలను పరిశీలిద్దాం’’ అని వ్యాఖ్యానించారు.

రాష్ట్రాల మధ్య చర్చల ద్వారానే జల వివాదాలు పరిష్కారమవుతాయని తెలంగాణ వంద శాతం విశ్వసిస్తోందని.. అనవసర రాద్ధాంతాలు తమకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. తెలంగాణతో ఎటువంటి సంప్రదింపులూ జరపకుండా ఏపీ సర్కారు నేరుగా కేంద్రం వద్దకు వెళ్తుండడంతో అది బీఆర్‌ఎ్‌సకు ఆయుధంగా మారుతోందని తెలిపారు. ‘బీఆర్‌ఎస్‌ రాజకీయంగా చచ్చిపోయింది. ఇప్పుడు జల వివాదాలను సంజీవనిగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. పదేళ్ల క్రితం ఎటువంటి జల వివాదాలు ఉన్నాయో.. ఇప్పటికీ అవే ఉన్నాయి. నాటి సీఎం కేసీఆర్‌, అప్పటి నీటి పారుదల మంత్రి హరీశ్‌ రావు వల్ల మరింత జఠిలంగా మారాయి. చేసిన తప్పులన్నీ చేసేసి, ఇప్పుడేమో తనకేమీ తెలియదన్నట్లు హరీశ్‌ డ్రామాలు ఆడుతున్నారు’ అని ధ్వజమెత్తారు. బనకచర్లకు బీజం పడింది 2016లోనేనని రేవంత్‌రెడ్డి తెలిపారు. సర్వే చేయాలంటూ 2016-18 మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం జీవోలు ఇచ్చిందని, అప్పుడే కేసీఆర్‌ కోర్టులను ఎందుకు ఆశ్రయించలేదని నిలదీశారు.

విభజన చట్టం ప్రకారం.. గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ, ఏపీలు ఏమైనా నిర్మాణాలు చేపట్టాలంటే మరో రాష్ట్రం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, ఇప్పుడు బనకచర్లకు సైతం తెలంగాణ అనుమతి తప్పనిసరని చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు వచ్చిన తర్వాత.. ఏపీ ప్రాజెక్టులకు తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పెండింగ్‌ పనులు పూర్తి కావాలంటే మరో రూ.50 వేల కోట్లు అవసరమని తెలిపారు. దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడానికి, కాళేశ్వరానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం.. కాళేశ్వరం నిర్మాణానికి ఏపీ అనుమతి తీసుకున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. అది కొత్త ప్రాజెక్టు కాదని, పాత ప్రాజెక్టునే రీడిజైన్‌ చేశారని బదులిచ్చారు.

Updated Date - Jun 21 , 2025 | 06:22 AM