TDP Leaders: డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగిన జగన్: వర్ల రామయ్య
ABN, Publish Date - Jul 16 , 2025 | 07:08 PM
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఓటమి చెందిన.. ఆ విషయం ఇంకా ఆయనకు అర్థం కాలేని సోమిరెడ్డి పేర్కొన్నారు.
అమరావతి, జులై 16: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మరోసారి విరుచుకు పడ్డారు. మద్యం కుంభకోణం కేసులో సిట్ దెబ్బకు జగన్ అవినీతి ముఠా అబ్బా అంటుందన్నారు. ఈ కేసులో సిట్ తన విచారణను ముమ్మరం చేయడంతో వైఎస్ జగన్ డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగాడన్నారు. బుధవారం రాజధాని అమరావతిలో వర్ల రామయ్య విలేకర్లతో మాట్లాడుతూ.. మద్యం కుంభకోణంలో అనుమానితులు ఎంతటివారైనా.. వారి పాస్‌పోర్ట్‌లను వెంటనే సీజ్ చేయాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన సూచించారు. లేకుంటే వారు విదేశాలకు పారిపోతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గత వైసీపీ పాలనలో మద్యం విక్రయాల్లో రూ. 3, 500 కోట్లకుపైగా నగదు కొట్టేసి దూబాయికి తరలించారని సిట్ దర్యాప్తులో తెలుస్తోందన్నారు. కేంద్రం సహకారంతో దుబాయ్‌లో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి ఈ అవినీతి దోషులను పట్టుకోవాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, కసిరెడ్డిలాంటి వారు.. నాయకుడికి తెలియకుండా.. ఇన్ని కోట్ల రూపాయిల అవినీతి చేయగలరా అంటూ? సందేహం వ్యక్తం చేశారు.
అసలు లబ్ధిదారుడు ఎవరో బయటపెట్టి వారిని కటకటాల్లోకి నెట్టాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఈ లోగా వారి పాస్ పోర్టులను స్వాధీనం చేసుకుని.. ఈ అవినీతి పిట్టలు విదేశాలకు ఎగిరిపోకుండా చూడాలని ప్రభుత్వానికి హితవు పలికారు. బుధవారం వైఎస్ జగన్ ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలన్నీ అబద్ధాలేని ఆయన స్పష్టం చేశారు. జగన్ హయాంలో తప్పు చేసిన పోలీసు అధికారులకు చట్ట బద్ధంగా శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.
చంద్రబాబు హయాంలో పోలీసులు మెడల్స్ తీసుకుంటే.. జగన్‌కు సహకరించిన పోలీసులు కటకటాల్లో మగ్గుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. జగన్ అవినీతికి సహకరించి కటకటాల్లోకి వెళ్లిన పోలీసులు మంచివారని.. ఏ తప్పు చేయలేదని జగన్ తనతో ఓపెన్ డిబెట్‌కు రాగలడా? అంటూ వైసీపీ అధినేతకు ఈ సందర్భంగా ఆయన సవాల్ విసిరారు.
జగన్ అవినీతి ముఠా ఇక్కడ కొట్టేసిన నగదుతో టాంజానియా, దుబాయిలాంటి దేశాలకు వెళ్లి స్టీల్ ప్లాంట్లు పెడుతున్నారని ఆరోపించారు. పరుపుల్లో దాచుకొని దొర్లాడుతున్నారని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. చేసిన పాపాలను డైవర్ట్ చేసేందుకు రప్పా రప్పా అంటూ రెచ్చగొట్టి ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తున్నారని వైసీపీ నేతల వైఖరిని ఈ సందర్భంగా వర్ల రామయ్య ఎండగట్టారు. చంద్రబాబు పాలన ఎలాంటిదో ఆయన వ్యక్తిత్వం ఏమిటో.. గత ఐదేళ్ల జగన్ పాలన ఎలా ఉందో అతని వ్యక్తిత్వం ఏమిటో బేరీజు వేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు.
ఇక టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. వైఎస్ జగన్‌కు ఇంకా ఓటమి అర్థం కాలేదన్నారు. ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి పోకడలు, ఆలోచనలు చూసిన తరువాత, ఈ రోజు అతని ప్రెస్ మీట్ చూశాక రెండు విషయాల్లో అందరికీ పూర్తిగా క్లారిటీ వచ్చిందని చెప్పారు. జగన్ మారలేదు. మారలేడు. 2029లో కూడా గెలవలేడని సోమిరెడ్డి జోస్యం చెప్పారు. వేరే దారి చూసుకోవాలంటూ వైసీపీ నేతలకు ఈ సందర్భంగా వైఎస్ జగన్ హితవు పలికారు. జగన్‌పై ఆశలు వదులుకోవాలంటూ కార్యకర్తలకు ఆయన కీలక సూచన చేశారు.
Updated Date - Jul 16 , 2025 | 07:08 PM