YCP JAGAN: తల్లికి వందనంతో పుట్టగతులు ఉండవని భయం
ABN, Publish Date - Jun 21 , 2025 | 05:13 AM
జగన్ తాను అధికారంలోకి వస్తే అందరికీ అమ్మ ఒడి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం చెప్పి న మాట ప్రకారం, ఇంట్లో చదువుకుంటున్న పిల్లలందిరికీ తల్లికి వందనం డబ్బులు వేస్తోంది.
అందుకే రౌడీ, గంజాయి మూకలతో యాత్రలు: ఆనంద సూర్య
అమరావతి, జూన్ 20(ఆంధ్రజ్యోతి): జగన్ తాను అధికారంలోకి వస్తే అందరికీ అమ్మ ఒడి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం చెప్పి న మాట ప్రకారం, ఇంట్లో చదువుకుంటున్న పిల్లలందిరికీ తల్లికి వందనం డబ్బులు వేస్తోంది. ఈ పథకం నిర్విరామంగా అమలైతే తమకు పుట్టగతు లు ఉండవని జగన్ గ్రహించారు. అందుకే తన రౌడీ, గంజాయి మూకల తో పరామర్శల పేరుతో తిరుగుతూ శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు’ అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. ‘తిరుమలపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ వైసీపీ నేతలు పాపం మూటకట్టుకుంటున్నా రు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉండగా తాళిబొట్ల కోసం అంటూ టన్నుల కొద్దీ బంగారాన్ని ముంబైకి తరలించి, తరుగు పేరుతో రూ.వేల కోట్ల విలువైన బంగారాన్ని దోచుకున్నారు. వైవీ సుబ్బారెడ్డి తిరుమల ప్రసాదాన్ని ఓ స్వీటు షాపులో అమ్మకానికి పెట్టి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. కూటమి పాలనలో టీటీడీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. చెవిరెడ్డికి పట్టిన గతే భూమనకు పట్టడం ఖాయం.’ అని అన్నారు.
జగన్‌కు మతిభ్రమించింది: గోరంట్ల
అమరావతి, జూన్ 20(ఆంధ్రజ్యోతి): అధికారం కోల్పోవడంతో జగన్‌కు మతిభ్రమించింది. అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు’ అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. ‘అసెంబ్లీకి రాకుండా, కుట్ర రాజకీయాలతో పరామర్శ యాత్రలు చేస్తున్నారు. గోబెల్స్ ప్రచారంతో నాడు అధికా రం చేపట్టిన అరాచక, ఆటవిక విధానాలతో హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడు. పొట్టేలు తలలు నరికినట్లు ఎవరి తలలు నరుకుతాడు? రౌడీ లు, గుండాలు, గంజాయి బ్యాచ్‌లను వెనకేసుకొస్తూ తలలు నరికితే తప్పేందంటవా? గత ఐదేళ్లు ఒక నియంతలా పరిపాలించి.
నేడు మళ్లీ అధికారం కోసం కులాలు, మతాలు, ప్రజలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతావా? అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు నీకు ఉందా? నువ్వు గెలుస్తావని బెట్టింగ్ పెట్టి ఆ డబ్బులు కట్టలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకుంటే ఏడాది తర్వాత పరామర్శకు వెళ్లి మరో ఇద్దరి చావుతో శవ రాజకీయాలు చేస్తున్నందుకు సిగ్గులేదా? మా కార్యకర్తలు తిరగబడితే వైసీపీ మూకల పరిస్థితి ఏమిటి?’ అని నిలదీశారు.
Updated Date - Jun 21 , 2025 | 06:29 AM