ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Political Motive: టీచర్‌ రాజీనామా వెనుక రాజకీయ కోణం

ABN, Publish Date - Jun 22 , 2025 | 03:42 AM

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కోటితీర్థంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎం. మధుసూదనరావు రాజీనామా చేయడం వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • ‘యోగాంధ్రకు నిరసనగా’ అంటూ లేఖలో వెల్లడి

  • ఒకరోజు కార్యక్రమానికే రాజీనామా చేస్తారా?

  • తోటి ఉపాధ్యాయ వర్గాల్లో అనుమానాలు

  • వైసీపీ అభిమాని కావడంతో ప్రచారం కోసమేనంటూ చర్చలు

నెల్లూరు, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కోటితీర్థంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎం. మధుసూదనరావు రాజీనామా చేయడం వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ఆయన తన రాజీనామా లేఖను ఎంఈవో కార్యాలయంలో అందజేశారు. ఆరేళ్ల పిల్లలతో ఉదయం 6గంటలకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం ఏమాత్రం ఆచరణ కాని అంశంగా ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్రం జాతీయస్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఆయన తప్పుబట్టారు. ఆచరణ సాధ్యం కానిదిగా, విద్యాశాఖ వింత పోకడగా వ్యాఖ్యానించారు. దీనిపై తోటి ఉపాధ్యాయ వర్గాలే తప్పుబడుతున్నాయి. ‘యోగాంధ్ర ఒక్కరోజు కార్యక్రమం.. దీనికోసం ఎవరైనా ఉద్యోగానికి రాజీనామా చేస్తారా?’ అని ప్రశ్నిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ఎన్ని ఇష్టం లేని కార్యక్రమాలను భరించలేదని గుర్తు చేసుకొంటున్నారు. మద్యం షాపుల క్యూలైన్ల వద్ద కాపలా ఉంచినప్పుడు లేని ఆత్మాభిమానం పిల్లలతో ఒకరోజు యోగా చేయించమంటే గుర్తొచ్చిందా అని నిలదీస్తున్నారు.

కచ్చితంగా ఆయన రాజీనామాకు ఇది సరైన కారణం కాదేమోనని అంటున్నారు. ఇక యాప్‌ల పేరుతో వేధిస్తున్నారనేది ఆ లేఖలో మధుసూదనరావు ప్రస్తావించిన రెండో అం శం. దీనిని కూడా సరైన కారణంగా టీచర్లు అంగీకరించడం లేదు. వైసీపీ హయాంలో మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాల్సి వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ పనుల నుంచి తప్పించింది. స్కూలు పరిధిలో ఉండే సచివాలయంలోని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌కు ఈ బాధ్యతను అప్పగించారని, కేవలం మధ్యాహ్న భోజనం ఫొటోలు మాత్రమే టీచర్లు అప్‌లోడ్‌ చేస్తున్నారని పేర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో ఇష్టం లేని పనులు చేశారు తప్ప, ఎవరూ రాజీనామాలు చేయలేదని, ఈ రాజీనామా వెనుక వేరే బలమైన కారణం ఉందేమోనని ఉపాధ్యాయ వర్గాలు చర్చించుకొంటున్నాయి. మధుసూదనరావు నెల్లూరులో కాపురం ఉంటున్నారు. ఆర్థికంగా స్థితిమంతుడైన ఈయన చాలా ఏళ్లుగా కారులోనే పాఠశాలకు వెళ్లేవారు. ఆయన రాజీనామా వెనుక రాజకీయ కారణం ఉందనే అనుమానాలనూ కొందరు వ్యక్తం చేస్తున్నారు. మధుసూదనరావు వైసీపీ అభిమాని అని, రాజకీయ ప్రచారం కోసం ఇలా చేసి ఉంటారేమో అనే చర్చ నడుస్తోంది.

Updated Date - Jun 22 , 2025 | 03:42 AM