ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Atmakuru: నల్లమలలో పెద్దపులి అనుమానాస్పద మృతి

ABN, Publish Date - May 02 , 2025 | 05:47 AM

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ పరిధిలో అనుమానాస్పదంగా పెద్దపులి మృతి చెందింది. పులి మృతికి గల కారణాలను తెలుసుకోవటానికి అటవీ శాఖ అధికారులు ప్రాథమిక నివేదిక కోరారు.

20 రోజుల తర్వాత గుర్తించిన అటవీ అధికారులు

ఆత్మకూరు, మే 1(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ పరిధిలో పెద్దపులి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన గురువారం వెలుగు చూసింది. ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వి.సాయిబాబా తెలిపిన వివరాల మేరకు.. కొత్తపల్లి మండలంలోని ముసలిమడుగు సెక్షన్‌, గుమ్మడాపురం బీట్‌ పరిధిలోని దేవరసెల వద్ద ఓ పెద్దపులి కళేబరాన్ని టైగర్‌ ట్రాకర్స్‌ గుర్తించారు. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో వారు అటవీ జాగిలాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 20 రోజుల క్రితమే పెద్దపులి మృతి చెందినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఎన్‌ఎ్‌సటీఆ్‌ఫ వైల్డ్‌లైఫ్‌ వెటర్నరీ డాక్టర్‌ ఆర్‌ఎన్‌.వెస్లీ, జుబేర్‌వలి అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిర్వహించారు. ముఖ్యమైన అవయవాల శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) ల్యాబ్‌కు పంపించారు. అనంతరం దేవరసెల సమీపంలోనే పెద్దపులి కళేబరాన్ని దహనం చేశారు. మరణించిన పెద్దపులి వయస్సు సుమారు 4-5 ఏళ్ల వరకు ఉంటుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ)కి సమాచారం ఇవ్వడంతో పులి మృతికి గల కారణాలపై ప్రాథమిక నివేదికను కోరినట్టు తెలిసింది.


ఇవి కూడా చదవండి

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 05:47 AM