ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mohan Babu: నటుడు మోహన్ బాబుకి సుప్రీంలో దక్కని ఊరట

ABN, Publish Date - Apr 30 , 2025 | 07:56 PM

నటుడు మోహన్ బాబుకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఎల్లుండి కోర్టు విచారణకు మోహన్ బాబు హాజరు కావాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

Mohan Babu And Supreme Court

ఢిల్లీ: నటుడు, శ్రీ విద్యానికేతన్ సంస్థల వ్యవస్థాపకుడు మోహన్ బాబుకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఎల్లుండి కోర్టు విచారణకు మోహన్ బాబు హాజరు కావలసిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 2019లో ఫీజు రేయింబర్స్ మెంట్ కోసం తిరుపతిలో మోహన్ బాబు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ధర్నా చేయడంపై వివాదం నెలకొంది. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ధర్నా చేశారని ఏపీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.


హాజరు కావాల్సిందే

2021లో పోలీసులు చార్జిషీట్‌ను దాఖలు చేశారు. అయితే, ఈ చార్జిషీట్‌ను కొట్టేయాలని నటుడు మోహన్ బాబు సుప్రీంను ఆశ్రయించారు. అయితే, మోహన్ బాబు పిటేషన్‌ను విచారించిన జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం.. ఛార్జ్ షీట్‌ను కొట్టేయడానికి నిరాకరించింది. ఎల్లుండి విచారణకు రావాలని స్పష్టం చేసింది. అయితే, ఎల్లుండి తిరుపతి మెజిస్ట్రేట్ కోర్ట్‌లో విచారణకు హాజరు కాకుండా మినహాయింపు అయినా ఇవ్వాలని మోహన్ బాబు తరపు న్యాయవాది సుప్రీంలో కోరారు. అందుకు నిరాకరించిన ధర్మాసనం ఎల్లుండి విచారణకి మోహన్ బాబు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది.


అసలేం జరిగిందంటే..

2019లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తమ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించలేదని మార్చి 22న మంచు కుటుంబం ధర్నా చేసింది. తిరుపతి - మదనపల్లె జాతీయ రహదారిపై నటుడు మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ కుమార్ విద్యార్థులతో కలిసి బైఠాయించి ఆందోళన చేశారు. అప్పటికే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. రోడ్డుపైకి వచ్చి వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగించారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, ధర్నాకు ముందస్తుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదని పలు సెక్షన్ల కింద వీరిపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.


Also Read:

BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్‌ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ

Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..

Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..

Updated Date - Apr 30 , 2025 | 08:17 PM