ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Somireddy Chandramohan Reddy : విజయసాయిరెడ్డి శిక్ష అనుభవించి తీరాల్సిందే

ABN, Publish Date - Jan 26 , 2025 | 05:06 AM

. ‘రాజీనామా పేరుతో విజయసాయిరెడ్డి వేస్తున్న ఎత్తులు, పైఎత్తులు, నక్కజిత్తులు చూస్తూఉన్నాం. కాంగ్రెస్‌, వైసీపీలకు వ్యతిరేకంగా పోరాడే నాపై కక్షగట్టి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో...

  • ఆయన పాపాలను దేవుడు కూడా క్షమించడు

  • ఉత్తరాంధ్రలో వేలకోట్లు దోచేశారు

  • చంద్రబాబు ప్రాణాలతోఉండకూడదని కోరుకున్న దుర్మార్గుడు

  • ఎమ్మెల్యే సోమిరెడ్డి వ్యాఖ్యలు

నెల్లూరు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : విజయసాయిరెడ్డి, ఆయన వియ్యంకుడి కుటుంబం చేసిన పాపాలను దేవుడు కూడా క్షమించడని, శిక్ష అనుభవించి తీరాల్సిందేనని ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ‘రాజీనామా పేరుతో విజయసాయిరెడ్డి వేస్తున్న ఎత్తులు, పైఎత్తులు, నక్కజిత్తులు చూస్తూఉన్నాం. కాంగ్రెస్‌, వైసీపీలకు వ్యతిరేకంగా పోరాడే నాపై కక్షగట్టి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలిసి కుట్రలు చేసిన దుర్మార్గుడు విజయసాయిరెడ్డి. నా కుమారుడికి, మా కుటుంబానికీ సూట్‌కేస్‌ కంపెనీలు, అక్రమాస్తులు ఉన్నాయని, మనీలాండరింగ్‌ చేశామని ఢిల్లీలో ఈడీ, ఐటీ, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీ్‌సకు ఫిర్యాదు చేశారు. మాది అల్లీపురం. మాకు కొంచెం దూరంలోనే విజయసాయి ఊరు తాళ్లపూడి ఉంది. తాతలు, తండ్రులు ఇచ్చిన ఆస్తులను రాజకీయాల కోసం అమ్ముకున్న కుటుంబం మాది. విజయసాయి తండ్రి, పినతండ్రి కలిసి వాళ్ల చిన్నాయనను హత్యచేసి జైలుకెళ్లిన చరిత్ర ఆ కుటుంబానిది. మా పెద నాయన ఆదినారాయణరెడ్డి స్వాతంత్య్ర పోరాటంలో జైలుకెళితే, విజయసాయిరెడ్డి తండ్రి, పినతండ్రులు మర్డర్‌ కేసులో ఊచలు లెక్కపెట్టారు. పురందేశ్వరిపై దుర్మార్గమైన భాషను ప్రయోగించారు. ఆ దుర్మార్గాన్ని నేనూ ఎదుర్కొన్నాను. అందుకు రూ.5 కోట్లకు నాపై విజయసాయిరెడ్డి పరువునష్టం దావా నోటీసు పంపారు. దాన్ని చెత్తబుట్టలో పడేశాను. తాళ్లపూడికి చెందిన సాయిరెడ్డి ఉత్తరాంధ్రతో ఏం సంబంధం? నెల్లూరుకే చెందిన ఆయన వియ్యంకుడు కూడా ఉత్తరాంధ్రలో పెత్తనం చేసి రూ.వేల కోట్లు దోచుకున్నారు. ఏ కారణం లేకుండా చంద్రబాబును జైలుకు పంపారు. 2029 ఎన్నికల నాటికి చంచద్రబాబు ప్రాణాలతో ఉండకూడదని కోరుకున్న దుర్మార్గపు వ్యక్తి విజయసాయిరెడ్డి.’ అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి

YS Sharmila: విజయసాయి ఇప్పటికైనా నిజాలు బయటపెట్టు.. షర్మిల చురకలు

విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే

వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే

కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..

For More Andhra Pradesh News and Telugu News..


Updated Date - Jan 26 , 2025 | 05:06 AM