Social Welfare Department: సాంఘిక సంక్షేమశాఖలో బదిలీలు
ABN, Publish Date - Jun 07 , 2025 | 04:52 AM
రాష్ట్రవ్యాప్తంగా పలువురు డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారులను (డీఎస్‌డబ్ల్యూఓ) బదిలీచేస్తూ సాంఘిక సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. గుంటూరు డిప్యూటీ డైరెక్టర్...
పలువురు డీడీలు, డీఎ్‌సడబ్ల్యూఓలకు స్థానచలనం
రాష్ట్రవ్యాప్తంగా పలువురు డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారులను (డీఎస్‌డబ్ల్యూఓ) బదిలీచేస్తూ సాంఘిక సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. గుంటూరు డిప్యూటీ డైరెక్టర్ డి.మధుసూధనరావును శ్రీకాకుళం జిల్లాకు, అక్కడ పనిచేస్తున్న వై.విశ్వమోహన్‌రెడ్డిని ఏలూరుకు, డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎం.అన్నపూర్ణమ్మను విజయనగరానికి, తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్న ఎంఎస్ శోభారాణిని కాకినాడకు, చిత్తూరు డీఎ్‌సడబ్ల్యూఓ యు.చెన్నయ్యను గుంటూరు డీడీగా స్థానచలనం చేశారు. డైరెక్టరేట్‌లో పనిచేస్తున్న డీఎ్‌సడీబ్యూఓ జె.విక్రమ్‌కుమార్‌రెడ్డిని చిత్తూరు డీడీగా నియమించి, తిరుపతి జిల్లాకు అదనంగా డీఎ్‌సడబ్ల్యూఓ బాధ్యతలు అప్పగించారు. డీఎ్‌సడబ్ల్యూ బి.రాధికను కర్నూలు డీడీగా, పార్వతీపురం మన్యం జిల్లా డీఎ్‌సడబ్ల్యూఓ ఎండీ గయాజుద్దీన్‌ను తూర్పుగోదావరి డీఎ్‌సడబ్ల్యూఓగా, ఎన్టీఆర్ జిల్లా డీడీ కేఎస్ శిరోమణిని డైరెక్టర్ కార్యాలయంలో డీడీగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.
Updated Date - Jun 07 , 2025 | 04:55 AM