shrimp Feed Price: రొయ్యల మేత గరిష్ఠ చిల్లర ధర తగ్గింపు
ABN, Publish Date - Apr 12 , 2025 | 05:49 AM
రొయ్యల మేత గరిష్ఠ చిల్లర ధర కిలోకు రూ.4 తగ్గింపునకు ష్రిమ్ప్ ఫీడ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సంక్షోభ సమయంలో ఆక్వా రైతులకు ఉపశమనం కల్పించేందుకు ఈ చర్య తీసుకున్నారు
కిలోకు రూ.4.. నేటి నుంచి అమలు
అమరావతి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): అమెరికా సుంకాల నుంచి ఆక్వా రైతులకు ఉపశమనం కల్పించేందుకు శనివారం నుంచి అన్ని కంపెనీల రొయ్యల మేత గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)పై కిలోకి రూ.నాలుగు తగ్గించనున్నట్లు ష్రిమ్ప్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఎస్‌ఎ్‌ఫఎంఏ)అధ్యక్షుడు బీద మస్తాన్‌రావు యాదవ్ ప్రకటించారు. అమెరికా సుంకాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశాలతో రొయ్యల మేత తయారీ కంపెనీలతో చర్చించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంక్షోభ సమయంలో ఆక్వా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో సీఎం చంద్రబాబు నిబద్ధతను మస్తాన్‌రావు ప్రశంసించారు.
Updated Date - Apr 12 , 2025 | 05:49 AM