ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భారతీరెడ్డి, జగన్‌ క్షమాపణ చెప్పాలి: షర్మిల

ABN, Publish Date - Jun 10 , 2025 | 04:09 AM

అమరావతి వేశ్యల రాజధాని అనే కామెంట్స్‌పై మహిళలకు భారతి రెడ్డి, జగన్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్‌ చేశారు. చిత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఆంధ్రుల రాజధాని అమరావతి...

చిత్తూరు రూరల్‌, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): అమరావతి వేశ్యల రాజధాని అనే కామెంట్స్‌పై మహిళలకు భారతి రెడ్డి, జగన్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్‌ చేశారు. చిత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఆంధ్రుల రాజధాని అమరావతి. మన రాజధాని మీద ఇలాంటి కామెంట్స్‌ ఎవరు చేసినా క్షమించకూడదు. ఈ కామెంట్స్‌కు భారతీరెడ్డి, జగన్‌ బాధ్యత వహించాలి. వేశ్యల రాజధాని అనే వ్యాఖ్యలను కాం గ్రెస్‌ పార్టీ ఖండిస్తోంది. ఇలాంటి మాటలు క్షమించరానివి. ఇలాంటప్పుడు పార్టీ అయినా, మీడియా హౌస్‌ అయినా సరే క్షమాపణ చెప్పాలి. వైసీపీకి చెందిన సాక్షి చానెల్‌లో ప్రసారం చేసినందుకు భారతీరెడ్డి క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. ఇలాంటి వ్యాఖ్యలు బేస్‌లెస్‌ అండ్‌ సెన్స్‌లెస్ ’ అని షర్మిల అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి స్పందిస్తూ... ‘కృష్ణంరాజు, కొమ్మినేనితో పాటు సాక్షి యాజమాన్యం రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకించి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఆ వ్యాఖ్యలు గర్హనీయం’ అని అన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 04:10 AM