ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YS Sharmila: ఏడాది పాలనలో చంద్రబాబు సాధించిందేమీ లేదు

ABN, Publish Date - Jun 13 , 2025 | 03:58 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలపై భారం మోపితే... ఇప్పుడు చంద్రబాబు ఏడాది పాలనంతా గొప్పలు చెప్పడానికే సరిపోయింది. ఆయన ఏడాది పాలనంతా 3డీ గ్రాఫిక్స్‌ మాయాజాలమే....

  • సూపర్‌ సిక్స్‌కు ఇప్పటికీ దిక్కులేదు

  • రాష్ట్రాన్ని మోసం చేస్తున్న బీజేపీకి మద్దతు ఎందుకిస్తున్నారు?: షర్మిల

అమరావతి, కడప, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): జగన్‌ ఐదేళ్ల పాలనలో రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలపై భారం మోపితే... ఇప్పుడు చంద్రబాబు ఏడాది పాలనంతా గొప్పలు చెప్పడానికే సరిపోయింది. ఆయన ఏడాది పాలనంతా 3డీ గ్రాఫిక్స్‌ మాయాజాలమే. ప్రజలకు ఇప్పటి వరకూ ఒనగూరిందేమీ లేదు’ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. గురువారం విజయవాడ, కడప, నంద్యాలలో పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల హామీల్లో ప్రధానమైన సూపర్‌ సిక్స్‌కి నేటికీ దిక్కు లేదు. తల్లికి వందనంలో 87 లక్షల మంది విద్యార్థులుంటే ఇప్పుడు 67 లక్షల మందికి ఇవ్వడం మోసం చేయడమే. జగన్‌ సర్కారు విద్యుత్‌ భారం రూ. 32 వేల కోట్లు మోపితే... బాబు ఏడాది పాలనలో రూ.17 వేల కోట్లు భారం మోపారు. రాజధాని పేరుతో చంద్రబాబు దాదాపు రూ.80వేల కోట్లు అప్పులు తెచ్చారు. ఈ అప్పులు ఎవరు తీర్చాలి? రాష్ట్రాన్ని మోసం చేస్తున్న బీజేపీకి మద్దతు ఎందుకిస్తున్నారు? బీజేపీని ఎదుర్కొనే సత్తా, దమ్ము ఉన్న పార్టీ కాంగ్రెస్‌. కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే రాష్ట్రానికి ప్రత్యామ్నాయం. ప్రాంతీయ పార్టీలతో ప్రజలకు ప్రయోజనం శూన్యం’ అని షర్మిల అన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 03:59 AM