IPL Betting Arrest: క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
ABN, Publish Date - Jun 01 , 2025 | 03:43 AM
కర్నూలు జిల్లా ఆదోని వన్‌టౌన్ పోలీసులు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 7 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రూ.91 లక్షల నగదు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారు నేషనల్ ఎక్స్చేంజ్-9, రాధే ఎక్స్చేంజ్, వజ్రా ఎక్స్చేంజ్ వంటి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసు వెల్లడించారు.
రూ.91 లక్షల నగదు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం
కర్నూలు క్రైం, మే 31 (ఆంధ్రజ్యోతి): ఐపీఎల్ క్రికెట్ బెట్టింగుకు పాల్పడుతున్న ఏడుగురు ముఠా సభ్యులను కర్నూలు జిల్లా ఆదోని వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.91 లక్షల నగదుతో పాటు 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ విలేకరులకు తెలిపిన వివరాలు...ఈ నెల 18వ తేదీన వాల్మీకి నగర్‌లో కొంత మంది సెల్‌ఫోన్‌లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా పోలీసులు దాడి చేశారు. నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మిగతా వారు పరారయ్యారు. నాగరాజు నుంచి రూ.50వేల నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ముఠాలో అంతర్రాష్ట్ర సభ్యులు ఉన్నట్టు, అంతా ఆన్‌లైన్‌లోనే క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నేషనల్ ఎక్స్ఛేంజ్-9, రాధే ఎక్స్ఛేంజ్, వజ్రా ఎక్స్ఛేంజ్, నేషనల్-777, మోర్ ఎక్స్ఛేంజ్ అనే బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసు విచారణలో వెల్లడైంది. ఒంగోలు, హైదరాబాదు, బెంగళూరు నగరాల్లో ముఠా సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మసీదుపురం ఇస్మాయిల్(ఆదోని), బోయ మహానంది (ఆదోని), బోయ రమేష్ (ఆదోని), రాకేష్ (చిక్‌బల్లాపుర్, కర్ణాటక), శ్రీనివాసరావు (ఒంగోలు జిల్లా), అడ్డాల కళ్యాణ్ (ఒంగోలు), రఘు ఆచారి (ఐజ)ను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 01 , 2025 | 03:43 AM