Srisailam dam : శ్రీశైలం డ్యాంలో రెండో రోజూ శాస్త్రవేత్తల సర్వే
ABN, Publish Date - Jun 05 , 2025 | 06:36 AM
శాస్త్రవేత్తలు ఎం.ఎస్ బిస్త్, అజయ్ సొనావనే, వీఎన్ కట్టే, రీసెర్చ్ అసిస్టెంట్ రాకీ పలు అంశాలపై అధ్యయనం చేశారు. ప్లంజ్‌పూల్‌తో పాటు కాంక్రీట్ సిలిండర్ల గ్యాలరీలను పరిశీలించారు.
నంద్యాల, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో కట్టడాల తీరుతెన్నులపై పుణేకు చెందిన కేంద్ర జల-విద్యుత్ పరిశోధనా సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) శాస్త్రవేత్తలు రెండో రోజు బుధవారం కూడా సర్వే చేశారు. శాస్త్రవేత్తలు ఎం.ఎస్ బిస్త్, అజయ్ సొనావనే, వీఎన్ కట్టే, రీసెర్చ్ అసిస్టెంట్ రాకీ పలు అంశాలపై అధ్యయనం చేశారు. ప్లంజ్‌పూల్‌తో పాటు కాంక్రీట్ సిలిండర్ల గ్యాలరీలను పరిశీలించారు. డ్యాంలోని కొన్ని ప్రాంతాలకు బోట్లలో వెళ్లారు. లేజర్ టెక్నాలజీని వినియోగించి ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వే చేశారు. శాస్త్రవేత్తలతో పాటు సంబంధిత ఇంజనీర్లు కూడా సర్వేలో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jun 05 , 2025 | 06:36 AM