ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bopparaju: సీఎం సమయం ఇవ్వలేదనడం సరికాదు

ABN, Publish Date - May 31 , 2025 | 05:27 AM

ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీహెచ్. రవీంద్రరాజు, బొప్పరాజు వ్యాఖ్యలను ఖండించారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు రూ. 25 వేల కోట్ల బకాయిల విషయంలో పాత నాయకులను విమర్శించారు.

బొప్పరాజుపై రెవెన్యూ అధికారుల సంఘం ధ్వజం

విజయవాడ(గాంధీనగర్‌), మే 30(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు చేసిన వ్యాఖ్యలను ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీహెచ్‌.రవీంద్రరాజు శుక్రవారం ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ, తమ సంఘం ప్రతినిధులు అనేకసార్లు సీఎంను కలిశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు ఉద్యోగులకు నష్టం కలిగించారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు సుమారు రూ.25వేల కోట్ల బకాయిలు పెట్టడాఇకి కారణం మీరుకాదా? అని ప్రశ్నించారు. గతంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, వారికి రావాల్సిన బకాయిల గురించి మాట్లాడకుండా ప్రభుత్వ పెద్దలు చెప్పింది విని వారికి భజన చేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన ఉద్యోగుల ప్రతి సమస్యనూ దశల వారీగా తీరుస్తామని మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించడంపై రవీంద్రరాజు హర్షం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు

Read Latest AP News And Telugu News

Updated Date - May 31 , 2025 | 05:28 AM