PSR Jail Meetings: పీఎస్‌ఆర్‌కు నాలుగు న్యాయ ములాఖత్‌లు
ABN, Publish Date - May 07 , 2025 | 06:51 AM
ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పీఎస్‌ఆర్ ఆంజనేయులుకు జైలులో నాలుగు న్యాయ ములాఖత్‌లు మంజూరయ్యాయి. విజయవాడ కోర్టు, వారంలో నాలుగు సార్లు న్యాయవాది నుంచి ములాఖత్ పొందేందుకు ఆదేశాలు ఇచ్చింది
విజయవాడ, మే 6(ఆంధ్రజ్యోతి): ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులుకు జైలులో ములాఖత్‌ల సంఖ్య పెరిగింది. ఆయన తన న్యాయవాదిని కలుసుకునేందుకు వారంలో నాలుగు ములాఖత్‌లను మంజూరు చేస్తూ విజయవాడ మూడో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. సీఐడీ కస్టడీ ముగిసిన తర్వాత పీఎస్‌ఆర్‌ను న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టినప్పుడు ములాఖత్‌ల అంశాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. తనకు ఐదు ములాఖత్‌లు ఉంటే వాటిని రెండుకు కుదించారని న్యాయాధికారికి చెప్పారు. దీనిపై మెమో దాఖలు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈమేరకు వేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయాధికారి టి.తిరుమలరావు వారంలో నాలుగుసార్లు న్యాయవాదితో ములాఖత్ అవ్వడానికి పీఎ్‌సఆర్‌కు అవకాశం కల్పించారు. పడుకోవడం కోసం ఆయనకు బెడ్, తలగడ ఇవ్వాలని ఆదేశించారు.
Updated Date - May 07 , 2025 | 06:51 AM