ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PSLV-C61: నేడు నింగిలోకి నిఘా నేత్రం

ABN, Publish Date - May 18 , 2025 | 05:45 AM

శ్రీహరికోట నుండి ఈవోఎస్‌–09 (రీశాట్‌–1బీ) ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ–సీ61 ద్వారా నేడు ప్రయోగించనున్నారు. సీ-బ్యాండ్‌ రాడార్‌తో ఇది ప్రతికూల వాతావరణంలోనూ అధిక స్పష్టతతో భూ చిత్రాలు అందించగలదు.

పీఎస్‌ఎల్వీ-సీ61 రాకెట్‌ ద్వారా ఈవోఎస్‌-09 ఉపగ్రహ ప్రయోగం

సూళ్లూరుపేట, మే 17(ఆంధ్రజ్యోతి): సరిహద్దుల్లో నిరంతర నిఘా కోసం ఉద్దేశించిన ఈవోఎస్‌-09 (రీశాట్‌-1బీ) ఉపగ్రహాన్ని పీఎ్‌సఎల్వీ-సీ 61 రాకెట్‌ నేడు నింగిలోకి మోసుకెళ్లనుంది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట షార్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 5.59 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. శనివారం ఉదయం 7.59 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. 22 గంటల పాటు ఈ కౌంట్‌డౌన్‌ కొనసాగుతుంది. ఒకటో ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్వీ-సీ 61 రాకెట్‌ అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. కాగా, రాకెట్‌లో ధ్రవ ఇంధనం, హీలియం, నైట్రోజన్‌ గ్యాస్‌ను నింపే కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు పూర్తిచేశారు. దేశ భద్రత, సైనిక అవసరాల కోసం రీశాట్‌-1బీ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే కార్టోశాట్‌-1 ఉపగ్రహం లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లో తిరుగుతూ చిత్రాలు అందిస్తోంది. అయితే అది రాత్రివేళల్లో ప్రతికూల వాతావరణంలో ఉపయోగపడటం లేదు. తాజాగా పీఎ్‌సఎల్వీ-సీ 61 రాకెట్‌ ద్వారా ప్రయోగించే ఈవోఎస్‌-09 ఉపగ్రహంలో అమర్చిన సీ-బ్యాండ్‌ సింథటిక్స్‌ ఎపర్చర్‌ రాడార్‌ ద్వారా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా అధిక రెజల్యూషన్‌తో కూడిన భూ ఉపరితల చిత్రాలు లభిస్తాయి.


ఇవి కూడా చదవండి..

Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 18 , 2025 | 05:49 AM