RTGS CEO Appointment: ఆర్టీజీఎస్ సీఈవోగా ప్రభాకర్ జైన్
ABN, Publish Date - Apr 17 , 2025 | 04:10 AM
ప్రభాకర్ జైన్‌ను ఆర్టీజీఎస్ సీఈవోగా నియమించిన ప్రభుత్వం, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజను టెక్నాలజీ సర్వీసెస్ ఎండీగా బదిలీ చేసింది.అధికారుల బదిలీలపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): రియల్ టైమ్ గవర్నెన్స్ సీఈవోగా ప్రభాకర్ జైన్ నియమితులయ్యారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా జేసీగా ఉన్న ఆయన ఆర్టీజీఎస్ సీఈవోగా నియమితులయ్యారు. అలాగే, నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న మైలవరపు సూర్యతేజను ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీగా ప్రభుత్వం బదిలీ చేసింది. అక్కడు ఉన్న ఐఆర్‌ఎస్ అధికారి ఎం.రమణరెడ్డిని జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
Updated Date - Apr 17 , 2025 | 04:11 AM