Polling: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ABN, Publish Date - Feb 27 , 2025 | 09:02 AM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. గట్టి బందోబస్తు నడుమ పోలింగ్ జరుగుతోంది. మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది (MLC Elections Polling Starts). గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది,. ఏపీ (AP)లో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతుండగా.. తెలంగాణ (Telangana)లో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఈ వార్త కూడా చదవండి..
కృష్ణ, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 33 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తుతో పాటు 144 సెక్షన్ అమలు చేశారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘాతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం, మొగల్తూరులలో ఎనిమిది కేంద్రాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ మొదలైంది. అన్ని కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గుడివాడ పట్టణంలో 10....గ్రామీణ ప్రాంతాల్లో 13 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టింది. అలాగే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
కృష్ణా గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో 6 లక్షల 62 వేల మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండు చోట్ల దాదాపు 60 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అధికారులు 939 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచరర్ ఎమ్మెల్సీ స్థానంలో 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ స్థానంలో అభ్యర్థిని ఎన్నుకునేందుకు 22,493 మంది ఉపాధ్యా యులు ఓటు వేయనున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం 123 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
తెలంగాణలో..
ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గంతోపాటు ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో 90 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ మూడు స్థానాల్లో ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు 973 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచారు. ఈ కేంద్రాలను నేరుగా కంట్రోల్ రూం నుంచే పర్యవేక్షిస్తున్నారు.
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సీటులో 3,55,159 మంది ఓటర్లు ఉన్నారు. 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మెదక్ , నిజామాబాద్, ఆదిలాబాద్ , కరీంనగర్ టీచర్స్ నియోజకవర్గంలో 27,088 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ స్థానంలో 25,797 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. 19 మంది బరిలో ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Feb 27 , 2025 | 09:02 AM