Harishrao: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు
ABN , Publish Date - Feb 27 , 2025 | 07:39 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని ప్రశ్నించిన వారి మరణాలపై రాజకీయ దుమారం రేగుతోంది. అయితే వీరి మరణాలపై అనుమానాలు ఉన్నాయంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
హనుమకొండ: మిస్టరీగా మరణాలు (Mysterious Deaths) అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలపై (Comments) బీఆర్ఎస్ సీనియర్ నేత (BRS Leader), మాజీ మంత్రి హరీష్ రావు (Ex Minister Harish Rao) స్పందించారు (Responded). సీఎం ఆరోపణల్లో వాస్తవం ఎంతుందో వాళ్ల అధికారులే చెప్పారన్నారు. భూ వివాదం వల్లే రాజలింగమూర్తి హత్య జరిగిందని భూపాలపల్లి ఎస్పీనే ప్రకటించారన్నారు. ఎస్పీ ఒకటి చెప్తే రేవంత్ రెడ్డి మరోటి అంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందని.. శాంతిభద్రతలు గాడితప్పాయని.. లా అండ్ ఆర్డర్ కుప్పకూలిందని హరీష్ రావు ఆరోపించారు.
ఈ వార్త కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో దుమారం
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని ప్రశ్నించిన వారి మరణాలపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్‌లో పిల్లర్లు కుంగిపోవడంలో నాణ్యతా ప్రమాణాలను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి హత్యకు గురికావడం తెలిసిందే. కాగా, ఈ కేసును వాదించిన న్యాయవాది గత ఏడాది ఆగస్టులోనే గుండెపోటుకు గురై మృతి చెందారు. అయితే వీరి మరణాలపై అనుమానాలు ఉన్నాయంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి అప్పటి సీఎం కేసీఆర్‌తో పాటు హరీశ్‌రావు కారణమూంటూ రాజలింగమూర్తి భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు.
అయితే కేసు నమోదు చేయడానికి స్థానిక పోలీసులు విముఖత చూపడంతో ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు 2024 సెప్టెంబరు 5న విచారణకు హాజరుకావాలంటూ కేసీఆర్, హరీష్‌రావుతోపాటు మరో ఆరుగురికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే కేసీఆర్, హరీశ్‌రావు డిసెంబరు 23న హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 2025 జనవరి 7లోగా తగిన కారణాలు చూపించాలంటూ రాజలింగమూర్తికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందుకు ఫిబ్రవరి 20 వరకు గడువు కావాలని రాజలింగమూర్తి కోరగా.. హైకోర్టు అంగీకరించింది. కానీ, కేసు విచారణకు ఒక్క రోజు ముందే ఫిబ్రవరి 19న రాజలింగమూర్తి దారుణహత్యకు గురయ్యారు. భూ తగాదాలే రాజలింగమూర్తి హత్యకు కారణంగా చెబుతున్నప్పటికీ.. కాళేశ్వరంలో అవినీతే రాజలింగమూర్తి ప్రాణం తీసిందని ఆయన భార్య ఆరోపిస్తున్నారు. మరోవెపు ఇదే కేసును రాజలింగమూర్తి తరుఫున వాదిస్తున్న న్యాయవాది గంటా సంజీవరెడ్డి గత ఆగస్టులో గుండెపోటుకు గురయ్యారు. ఆయనను హనుమకొండలోని ఓ ప్రేవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ వారం తరువాత మృతి చెందారు. దీంతో ఆయనపై ఎవరైనా ఒత్తిడి చేయడం వల్లే గుండెపోటుకు గురయ్యారా? అనే అనుమానాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News