ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Polavaram Project: ఏడాదిలో ఎంత తేడా

ABN, Publish Date - Jun 07 , 2025 | 05:03 AM

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి సర్కారు భారీ విజయాన్ని సొంతం చేసుకుని పాలనా పగ్గాలు చేపట్టడంతో.. రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు మంచి రోజులు వచ్చాయి.

  • పోలవరానికి మంచిరోజులు

  • జగన్‌ ఐదేళ్ల హయాంలో జరిగిన పనులు 3.84 శాతమే

  • కూటమి ప్రభుత్వం వచ్చిన12 నెలల్లోనే 5.93% పనులు పూర్తి

  • చకచకా కొత్త డయాఫ్రం వాల్‌

  • సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్‌ కూడా

  • భూసేకరణలోనూ పురోగతి

  • విధ్వంసం నుంచి ప్రగతి దిశగా పరుగు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి సర్కారు భారీ విజయాన్ని సొంతం చేసుకుని పాలనా పగ్గాలు చేపట్టడంతో.. రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు మంచి రోజులు వచ్చాయి. జగన్‌ జమానాలో జరిగిన విధ్వంసం నుంచి బయటపడి.. ప్రాజెక్టు పనులు లక్ష్యం దిశగా పరుగులు పెడుతున్నాయి. జగన్‌ గద్దెనెక్కేనాటికి.. అంటే 2019 మే నాటికి 71.93 శాతం జరిగిన పనులు.. 2024 మే నాటికి.. అంటే ఐదేళ్లలో కేవలం 3.84 శాతమే జరిగాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత 12 నెలల్లో 5.93 శాతం పనులు జరిగాయి. మొత్తంగా ప్రాజెక్టు పురోగతి 81.70 శాతానికి పెరిగింది. నిర్వాసితులకు సహాయ పునరావాసం, భూసేకరణ పనులు 2019 నాటికి 18.66 శాతం జరుగగా.. జగన్‌ ఐదేళ్ల పాలనలో 3.89 శాతమే జరిగాయి. ఇప్పుడు చంద్రబాబు సర్కారు వచ్చిన ఏడాది కాలంలోనే.. 2.56 శాతం మేర భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలు అమలై.. 25.11 శాతానికి చేరాయి. ఏడాదిలోనే ప్రాజెక్టు మొత్తం ప్రగతి 6.96 శాతం పెరిగి.. 56.75 శాతానికి చేరింది. ఈ గణాంకాలను చూస్తే జగన్‌ ఐదేళ్ల పాలనలో ఎంత విధ్వంసం జరిగిందో స్పష్టమవుతోందని సాగునీటి నిపుణులు చెబుతున్నారు.


ఆ పనులను కొనసాగిస్తే..

పోలవరర ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ 2020లో వచ్చిన వరదలకు దెబ్బతింది. 2019 మే నెలలో అధికార పగ్గాలు చేపట్టాక.. వేగంగా జరుగుతున్న పనులను జగన్‌ కొనసాగించి.. వాల్‌పై ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాంను వేసి ఉంటే.. వరదలకు దెబ్బతినేది కాదు. ప్రాజెక్టును పూర్తిచేస్తే ఈ ఘనత చంద్రబాబు ఖాతాలో పడుతుందన్న దుగ్ధతో దాని నాశనాన్ని కోరుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన నిర్వాకంతో కొత్త డయాఫ్రం వాల్‌ కట్టాల్సి వస్తోంది. ఈ ఏడాది జనవరిలో 63,656 చదరపు మీటర్ల వాల్‌ పనులు ప్రారంభించారు. ఇప్పటిదాకా 11,503 చదరపు మీటర్ల పొడవున పనులు జరిగాయి. మిగిలిన పనులను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. వాల్‌ పనులతో సమాంతరంగా ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) గ్యాప్‌-1 పనులు కూడా మొదలయ్యాయి. ఇవి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంతో పాటు గ్యాప్‌-2 పనులు 2027 జూన్‌ నాటికి పూర్తవుతాయని, ఇదే జరిగితే మొత్తం ప్రాజెక్టు పూర్తయినట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు.

Updated Date - Jun 07 , 2025 | 05:05 AM