ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Polavaram Project: పోలవరం స్పిల్‌వే నుంచి 21,874 క్యూసెక్కుల నీరు విడుదల

ABN, Publish Date - Jun 22 , 2025 | 04:47 AM

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 21,874 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేసినట్టు జలవనరుల శాఖ అధికారులు శనివారం తెలిపారు.

పోలవరం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 21,874 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేసినట్టు జలవనరుల శాఖ అధికారులు శనివారం తెలిపారు. ప్రాజెక్టు స్పిల్‌వేలో 48 గేట్ల నుంచి, 6 స్లూయిజ్‌ల నుంచి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు స్పిల్‌వే ఎగువన 25.92 మీటర్లు, దిగువన 15.98 మీటర్లు, ఎగువ కాపర్‌ డ్యాంకి ఎగువన 25.91 మీటర్లు, దిగువ కాపర్‌ డ్యాంకి దిగువన 14.08 మీటర్లు, ఎగువ, దిగువ కాపర్‌ డ్యాం నడుమ 15.58 మీటర్ల నీటిమట్టం నమోదైనట్టు అధికారులు తెలిపారు. కాగా, కేంద్ర మట్టి, పదార్థాల పరిశోధన కేంద్రం (సీఎ్‌సఎంఆర్‌ఎస్‌) బృందం రెండో రోజు శనివారం కూడా నమూనాల సేకరణ చేపట్టింది. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ఎగువన దేవీపట్నం మండలం వంజరం గ్రామ పరిధిలో తవ్వకాలు జరిపి మట్టి నమూనాలు సేకరించారు.

Updated Date - Jun 22 , 2025 | 04:47 AM