Yogandhra 2025: విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ABN, Publish Date - Jun 20 , 2025 | 07:20 PM
Yogandhra 2025: భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాని మోదీ శనివారం విశాఖపట్నంలో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు.
యోగా డే కార్యక్రమాన్ని సక్సెస్ చేద్దాం
యోగా మన సంస్కృతి, సంపద అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించే యోగాను నిత్యం ఆచరిద్దామని ప్రజలకు విజ్ణప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో విశాఖ ఆర్కే బీచ్‌లో జరగనున్న యోగా డే కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేద్దాం. రాష్ట్రంలో వాడవాడలా యోగా సాధనతో సరికొత్త రికార్డు సృష్టిద్దాం. వారసత్వంగా వచ్చిన యోగాను మనమంతా ఆచరించటంతో పాటు భవిష్యత్ తరాలకూ అందిద్దాం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
స్పెషల్ ట్రైన్లో పొట్టుపొట్టు కొట్టుకున్న అమ్మాయిలు
ఎయిర్‌స్పేస్ తెరిచిన ఇరాన్.. ఢిల్లీకి రానున్న 1,000 మంది భారతీయ విద్యార్థులు
Updated Date - Jun 20 , 2025 | 07:45 PM