ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pinnelli Brothers: ముందస్తు బెయిల్‌ మంజూరు చేయండి

ABN, Publish Date - Jun 04 , 2025 | 04:49 AM

పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల హత్యకేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేశారు. హత్య రాజకీయ కారణాలతో జరిగిందని పేర్కొంటూ, వారి పేర్లు తప్పుగా చేర్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

  • హైకోర్టులో పిన్నెల్లి సోదరుల పిటిషన్‌.. టీడీపీ నేతల హత్య కేసు

అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్య కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నిందితులు ఇద్దరూ టీడీపీకి చెందినవారేనని, ఆ పార్టీలో ఆధిపత్య పోరు కారణంగా హత్య జరిగిందని పిటిషన్‌లో వెల్లడించారు. హత్య అనంతరం జిల్లా ఎస్పీ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారని తెలిపారు. హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని, స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో తమను నిందితులుగా చేర్చారని ఆరోపించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని అభ్యర్థించారు.

Updated Date - Jun 04 , 2025 | 04:51 AM